Begin typing your search above and press return to search.
డిస్ట్రిబ్యూషన్ కు మైత్రీ రెడీ..ఇంతకీ ప్లాన్ ఏంటీ?
By: Tupaki Desk | 8 Dec 2022 9:31 AM GMTటాలీవుడ్ లో వున్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో వరుస భాకీ సినిమాలతో ముందు వరుసలో నిలుస్తున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. మెగాస్టార్ చిరంజీవితో మొదలు కొని యంగ్ స్టర్ కిరణ్ అబ్బవరం వరకు అందరు హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. 2023 సంక్రాంతికి ఈ సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు పోటీపడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో మైత్రీ వారు నిర్మిస్తున్న మూవీ 'వాల్తేరు వీరయ్య'. బాబి డైరెక్ట్ చేస్తున్నాడు.
2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా రీసెంట్ గా చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఇదే సంస్థ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతోనూ ఓ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్‌ని రీసెంట్ గా ప్రకటించడమే కాకుండా ఈ మూవీన 2023 జనవరి 12న రిలీజ్ చేస్తన్నామంటూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు.
ఈ రెండు సినిమాలతో పాటు త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ అల్లు అర్జున్ - సుకుమార్ ల కలయికలో పాన్ ఇండియా వండర్ 'పుష్ప'కు సీక్వెల్ గా 'పుష్ప 2'ని త్వరలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తో పాటు మైత్రీ వారు కొంత మంది స్టార్ హీరోలకు, క్రేజీ డైరెక్టర్ లకు కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్ లు ఇచ్చారట. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు, దర్శకుడు హరీష్ శంకర్ కూ 'భవదీయుడు భగత్ సింగ్' ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ లు ఇచ్చారు. మరి కొంత మందికి కూడా అడ్వాన్స్ లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా వుంటే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న మైత్రీ వారు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని తెరవండం.. ఈ రంగంలోకి అడుగు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో అదికూడా నైజాం ఏరియాలో మైత్రీ వారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని ఏర్పాటు చేయడం సరికొత్త చర్చకు తెర తీస్తోంది. రానున్న ఇయర్స్ లో వీరి సంచి భారీ సినిమాల రిలీజ్ లు వున్న నేపథ్యంలో ఇతరులకు తమ సినిమాలు ఇవ్వడం కంటే తామే రిలీజ్ చేస్తే బెటర్ అని భావించిన డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నైజాం ఏరియాలోని డిస్ట్రిబ్యూషన్ రంగంలో గత కొన్నేళ్లుగా దిల్ రాజు, ఏషియన్ సునీల్ లదే హవా కొనసాగుతోంది. వరంగల్ శ్రీను ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రీ వారు ఎంటర్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు, ఏషియన్ సునీల్ తరహాలో మైత్రీ వారి చేతిలో థియేటర్లు లేవు. మరి ఏ ధైర్యంతో వీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే వీరికి చాలా మంది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మద్దతుగా నిలుస్తుండటంతో మైత్రివారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఎదగడం గ్యారంటీ అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.