Begin typing your search above and press return to search.

మైత్రి వారి బిగ్ లైనప్.. లైన్ లో మరో ఇద్దరు!

By:  Tupaki Desk   |   14 Jan 2023 9:30 AM GMT
మైత్రి వారి బిగ్ లైనప్.. లైన్ లో మరో ఇద్దరు!
X
ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేలా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాల బిజినెస్ ఇప్పటికే జరిగిపోయింది. ఇక ఒటీటీ, శాటిలైట్ రైట్స్ కలుపుకొని భారీగానే ఈ సినిమాల మీద నిర్మాతలు రాబట్టారు. థీయాట్రికల్ రైట్స్ అమ్మేయడంతో భారీ లాభాలు రిలీజ్ కి ముందే వచ్చేసాయి. ఇక వీరి నెక్స్ట్ మూవీస్ జాబితా చూసుకుంటే ఏకంగా ఏడు సినిమాల వరకు ఉన్నాయి.

వాటిలో పుష్ప పార్ట్ 2 తో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా, ఆలాగే రామ్ చరణ్ మూవీ కూడా ఉన్నాయి. ఇవన్ని పాన్ ఇండియా లెవల్ సినిమాలు కావడం విశేషం. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మరో బిగ్ స్కెచ్ వేస్తూ బాలీవుడ్ లో కూడా తమ హవాని కొనసాగించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ జాబితాలో రెండు క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు.

మరో ఐదేళ్ళ వరకు గట్టిగా సినిమాలని లైన్ లో పెట్టడంతో పాటు ఏకంగా మూడు వేల కోట్ల వ్యాపారం సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ ప్లాన్ లో భాగంగా డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ కాంబినేషన్ ని సెట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం సిద్ధార్ద్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో పఠాన్ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ మీద ఓ వైపు నెగిటివ్ టాక్ ఉన్నా కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కచ్చితంగా ఈ మూవీ బాలీవుడ్ ఫేట్ మారుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

ఇక ఈ సల్మాన్ ఖాన్ తో చేయబోయే సినిమా కోసం దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారు. హరీష్ శంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం ఇదే బ్యానర్ లో హరీష్ చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ బట్టి సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ ని టేకోవర్ చేసేఛాన్స్ ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.