Begin typing your search above and press return to search.

రెండు దెబ్బలు నేర్పిన పాఠాలు!

By:  Tupaki Desk   |   27 Nov 2018 6:24 AM GMT
రెండు దెబ్బలు నేర్పిన పాఠాలు!
X
కొత్తగా బ్యానర్ పెట్టిన మొదట్లోనే వరసగా ఒకదాన్ని మించి స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్స్ దక్కడం అంటే మాటలు కాదు. మైత్రి సంస్థ ఈ అరుదైన ఘనతను దక్కించుకుంది. మహేష్ తో శ్రీమంతుడు తారక్ తో జనతా గ్యారేజ్ రామ్ చరణ్ తో రంగస్థలం ఇలా దేనికవే ఆ హీరోలకూ కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. కట్ చేస్తే మూడు వారాల కాలం మొత్తం తారుమారు చేసింది. పద్నాలుగు రోజుల గ్యాప్ లో మైత్రి నుంచి వచ్చిన సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసేశాయి. కనీసం పది కోట్ల షేర్ ను కూడా అందుకోలేక పెద్ద షాక్ ఇచ్చాయి.

రంగస్థలం తర్వాత ఇకపై వరసగా సినిమాలు చేస్తామని నెలకో మూవీ వచ్చేలా ప్లానింగ్ లో ఉన్నామని ఇందులో భాగస్వాములుగా ఉన్న ముగ్గురు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ విషయంలో తొందరపడకూడదని డిసైడ్ అయినట్టు టాక్. నిర్మాణంలో ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి మినహాయించి మిగిలినవన్నీ హోల్డ్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారట. అంటే ఆపడం అని కాదు. మళ్ళి స్క్రిప్ట్ లను పూర్తిగా విని విశ్లేషించి వడపోత చేసే కార్యక్రమం అన్నమాట.

ఒకవేళ వర్క్ అవుట్ కావు అనుకున్నవి మొహమాటం లేకుండా పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వరసగా సినిమాలు విడుదల చేయాలనే టార్గెట్ కాకుండా బ్రాండ్ వేల్యూ నిలిచేలా మైత్రిని మార్కెట్ లో బలంగా నిలిపే కథలను మాత్రమే ఫైనల్ చేయబోతున్నట్టు సమాచారం. ఇదీ ఒకందుకు మంచిదే. రాసి కంటే వాసి ముఖ్యం అని పెద్దలు ఊరికే అనలేదు కదా. మైత్రికి ఈ సత్యం రెండు ప్లాప్స్ వచ్చాక బోధపడినట్టు ఉంది