Begin typing your search above and press return to search.
కామ్రేడ్ తెచ్చిన తంటాలు
By: Tupaki Desk | 7 Aug 2019 5:54 AM GMTకనీసం యావరేజ్ అయినా అవుతుందేమో అనుకున్న డియర్ కామ్రేడ్ ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలిపోయింది. సెకండ్ వీకెండ్ ఏదైనా కాపాడుతుందేమో అని ఎదురు చూసిన నిర్మాతలకు విజయ్ దేవరకొండ అభిమానులకు ఫైనల్ గా నిరాశ తప్పలేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రేపో ఎల్లుండో మిలియన్ మార్క్ అని ప్రకటించిన నిర్మాతలు గప్ చుప్ అయిపోయారు. భారీ పెట్టుబడి పెట్టిన బయ్యర్ కు నష్టం తప్పదని తేలిపోయింది.
విజయ్ దేవరకొండ గత సినిమాల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువనిపించినా సాహసం చేసి డియర్ కామ్రేడ్ ని ఎక్కువకు కొన్న యుఎస్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి సంస్థ నెక్స్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ ని తనకే ఇమ్మని ఒత్తిడి చేస్తున్నట్టు టాక్. నాని గ్యాంగ్ లీడర్ డేట్ ఇంకా ఫిక్స్ చేయనప్పటికీ సెప్టెంబర్ లో రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ముందు అనుకున్న తేదికి సాహో ఫిక్స్ కావడంతో అనవసరంగా పోటీకి దిగితే లేనిపోనీ ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నట్టు టాక్. కామ్రేడ్ ఇప్పుడు నాని గ్యాంగ్ లీడర్ నే కాదు మైత్రికి బ్రాండ్ పరంగా కూడా డ్యామేజ్ చేసింది.
అసలే గత ఏడాది సవ్యసాచి-అమర్ అక్బర్ అంటోనీ ఫలితాలతో బాగా దెబ్బ తిన్న మైత్రి డియర్ కామ్రేడ్ తో వాటిని పూర్తిగా పూడ్చుకోవచ్చు అనుకుంటే ఏకంగా ఆ లోటుని రెట్టింపు చేయడం అసలు షాక్. చాలా చోట్ల కలెక్షన్లు మరీ తీసికట్టుగా ఉన్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. మొన్న గుణ 369-రాక్షసుడు వచ్చినప్పుడు స్క్రీన్లు తక్కువగా ఉండే బీసి సెంటర్స్ లో తీసేశారు. ఇక ఈ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు సినిమాలు వస్తున్నాయి. సో ఇక ఏ సెంటర్స్ లోనూ కామ్రేడ్ ఫైనల్ రన్ కు వచ్చేయక తప్పదు. దెబ్బకు రిలీజైన మొదటి రెండు రోజులు విజయ్ కొంత హడావిడి చేసినా ఫైనల్ గా ఏది చేసినా లాభం లేదని గుర్తించి త్వరగా సైలెంట్ అయిపోవడం గమనార్హం