Begin typing your search above and press return to search.
లక్కంటే ఈ నిర్మాతలదే
By: Tupaki Desk | 11 April 2018 9:22 AM GMTరంగస్థలం విజయంతో మైత్రి బ్యానర్ నిర్మాతలు నటీనటులతో సహా యూనిట్ లో ప్రతి ఒక్కరు మేఘాల్లో తేలుతున్నారు. ఊహలకు వంద రెట్లు ఎక్కువ సక్సెస్ కావడంతో కాలు నిలవడం లేదు. కాని విడుదల ముందు వరకు వేరే కథ నడిచిందట. అనుకున్న బడ్జెట్ కన్నా పది కోట్లకు పైగా ఎక్కువ ఖర్చు కావడంతో ఒకవేళ ఫలితం కనక తేడానో యావరేజో వస్తే ఏంటి పరిస్థితి అని ముందుచూపుతో నష్టాలను తగ్గించుకునే క్రమంలో సుకుమార్ తో తమ బ్యానర్ లోనే రెండో సినిమా చేసేలా ఒప్పందం చేసుకుని ఆ మేరకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని ప్రకారం సుకుమార్ ఏ హీరోతో చేసినా అది మైత్రి బ్యానర్ లోనే చేయాల్సి ఉంటుంది. తన దగ్గర కొత్త కథేది రెడీగా లేదంటున్న సుక్కు ప్రభాస్ తో కాని అల్లు అర్జున్ తో కాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయొచ్చని ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
అనూహ్యంగా రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కావడంతో సుకుమార్ డిమాండ్ అమాంతం ఎగబాకింది. దీని కన్నా ముందే తనతో సినిమాలు చేసేందుకు హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ రంగస్థలం లెక్కలు మార్చాక తమకూ అలాంటి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న సినిమా చేయమని కొందరు స్టార్ హీరోస్ చనువుతో కాస్త గట్టిగానే అడిగినట్టు టాక్. ఒకవేళ రంగస్థలం ఫలితం కనక నిరాశ పరిచి ఉంటే రెండో సినిమాని తక్కువ బడ్జెట్ పారితోషికంతో మైత్రికే చేసేలా ఒప్పందంలో ఉందట. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. సుక్కు సూపర్ సక్సెస్ కొట్టాడు. రాజమౌళి తర్వాత రికార్డుల పరంగా తన సినిమానే టాప్ రేస్ లో నిలబెట్టాడు.
ఇప్పుడు మైత్రి మేకర్స్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ మాత్రం రంగస్థలం సక్సెస్ ని ఇంకొద్ది రోజులు ఆస్వాదించే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న దర్శకుడితో నెక్స్ట్ మూవీ చేసుకోవడం అనే స్ట్రాటజీ సాధారణంగా దిల్ రాజు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మైత్రి కూడా అదే దారిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక్క హిట్టుకే సీనియర్ నిర్మాతలు సైతం పోరాడుతుంటే వరసగా మూడు ఇండస్ట్రీ హిట్స్ అంటే మాటలా.