Begin typing your search above and press return to search.
మహేష్-బన్నీలను తేజు కోసం వాడారా?
By: Tupaki Desk | 4 March 2019 3:30 PM GMTఇవాళ ఉన్నట్టుండి అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో మైత్రి సంస్థ కొత్త మూవీ ప్రకటన చూసి అందరూ షాక్ తిన్నారు. కారణం చాలా స్పష్టం. మహేష్ బాబు ఇప్పటికే సుకుమార్ కు కమిట్మెంట్ ఇచ్చినట్టు వార్తలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని ఒప్పుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టనేలేదు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంటుగా బన్నీ-సుక్కుల కాంబో ఎందుకు అనౌన్స్ చేశారన్న చర్చ అభిమానుల మధ్య జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం మైత్రి సంస్థకు గత ఏడాది రంగస్థలం తర్వాత సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో బ్యానర్ బ్రాండ్ ఇమేజ్ మీద కాస్త ప్రభావం పడింది. ఇప్పుడు విడుదలకు రెడీ అవుతున్న మూవీ చిత్రలహరి. సాయి ధరమ్ తేజ్ కున్న మార్కెట్ దృష్ట్యా దీని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు బయ్యర్లు సముఖంగా లేరు. సో వీళ్ళను ఆకర్షించాలి అంటే తమ దగ్గర ఎంత పెద్ద ప్రాజెక్టులున్నాయో చెప్పేస్తే ఆటోమేటిక్ గా వాటికోసమైనా చిత్రలహరికి ఆశించిన దాని కన్నా మంచి రేట్లు రాబట్టుకోవచ్చని ఇలా ప్లాన్ చేశారట.
ఒకవేళ తేజు సినిమాను మైత్రి చెప్పిన రేట్ కు కొనలేము అని బయ్యర్లు చెబితే అప్పుడు మహేష్ బన్నీ సినిమాలు ఎలాగూ మేమె తీస్తున్నాం కాబట్టి అప్పుడు చూసుకుందాం ఇప్పటికి దీన్ని గట్టెక్కించండి సినిమా కూడా చాలా బాగా వచ్చింది అని కన్విన్స్ చేస్తారట. చిత్రలహరి నిజంగా బాగా వచ్చినా అది మార్కెటింగ్ కావాలి అంటే ఇలాంటి తాయిలాలు చూపించక తప్పదు. హీరో దర్శకుడు హీరోయిన్లు ఇలా ఎవరి బ్రాండ్ మీదా చిత్రలహరికి డిమాండ్ వచ్చే సీన్ లేదు. సో మహేష్ బన్నీల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని ఇలా వాడుకుంటున్నారు అనే కామెంట్స్ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. పెద్దలు లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని ఊరికే అనలేదు