Begin typing your search above and press return to search.
మైత్రి సంస్థ అడ్వాన్సులు లాక్కుందా?
By: Tupaki Desk | 7 May 2019 2:30 PM GMTఏ రంగంలో అయినా క్లారిటీ మిస్సయితే ఎదుగుదల చాలా కష్టం. సందర్భానుసారం ప్రణాళికలు మార్చుకుని నవ్యపంథాలో వెళితేనే దూసుకుపోగలరు. అది ఏ ఇండస్ట్రీకి అయినా వర్తిస్తుంది. ముఖ్యంగా సినీపరిశ్రమలో ఇది చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ ఇచ్చాం కదా అని ఏళ్లకు ఏళ్లు వేచి చూస్తే ప్రయోజనం ఉండదు కదా.. బోలెడంత ప్రయత్నం.. దాంతో పాటే శ్రమ వృధా అవుతుంది. ఈ సత్యాన్ని పక్కాగా గ్రహించిందట మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఆ క్రమంలోనే కొందరు బడా దర్శకులు.. హీరోలకు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తీసుకునే ఆలోచనలో సదరు కంపెనీ ఉందని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లోనే అత్యంత వేగంగా ప్రణాళికల్ని అమలు చేస్తూ సక్సెస్ ఫుల్ కంపెనీగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ మాంచి దూకుడుమీద ఉన్నప్పుడు పలువురు స్టార్ హీరోలు .. స్టార్ డైరెక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చింది. వారితో రేపో మాపో సినిమాలు చేసేయడం ఖాయమనే భావించారంతా. కానీ అది ఎందుకనో అంతకంతకు వాయిదా పడుతూనే ఉంది. సదరు స్టార్ హీరోలు.. డైరెక్టర్లు రకరకాల కమిట్ మెంట్ల వల్ల మైత్రితో వెంటనే సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో అంతకంతకు ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం మైత్రి అధినేతలకు నచ్చలేదట. ఈలోగానే వరుసగా ఓ రెండు ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.
స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్.. బోయపాటి ఇద్దరికి మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్సులు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరి నుంచి వాటిని వెనక్కి తీసుకునే యోచనలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఆస్థాన దర్శకుడు కొరటాల శివ సైతం ఇప్పట్లో అందుబాటులో లేరు. తనతో సినిమా ఇప్పట్లో మొదలయ్యేట్టు కనిపించడం లేదు. అందుకే మీడియం రేంజ్ హీరోలతోనే వరుసగా సినిమాలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పెద్ద హీరోలు పెద్ద దర్శకులతో పెట్టుకుంటే క్లారిటీ మిస్ అవుతోందనే ఇలా రూటు మారుస్తున్నారట. నాని- విజయ దేవరకొండ- శర్వానంద్ లాంటి మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం దేవరకొండతో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నారు. శర్వానంద్ తో ఓ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే సాయిధరమ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్టులు దొరికితే మైత్రిలో కొత్తవాళ్లకే జాక్ పాట్ తగిలే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బిగ్ స్టార్లు ఎవరూ అందుబాటులో లేరు.. కాల్షీట్ల పరంగా క్లారిటీ లేకపోవడం కూడా కొత్త వాళ్లకు ప్లస్ కానుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి చాలా కాలం క్రితమే అడ్వాన్సులు ఇచ్చారు. రాజకీయ కారణాలతో పవన్ ఇప్పటివరకూ చేయలేకపోయినా.. ప్రస్తుతం ఎన్నికల హడావుడి సద్ధుమణిగాక.. తిరిగి సినిమా చేస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే దానికి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. అలాగే బన్నితో ఏఏ 20 చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.