Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కు ఏమవ్వలేదు: యూనిట్ క్లారిటీ

By:  Tupaki Desk   |   16 March 2016 3:15 PM IST
ఎన్టీఆర్‌ కు ఏమవ్వలేదు: యూనిట్ క్లారిటీ
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ షూటింగ్ లో.. జూనియర్ కు యాక్సిడెంట్ అయిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అసలు యాక్సిడెంట్ అయేందుకు అవకాశం లేదని... ప్రస్తుతం ముంబై షెడ్యూల్ లో స్టంట్స్, ఫైట్స్ లాంటివేవీ ఈ షెడ్యూల్ లో షూట్ చేయడం లేదని ఇప్పటికే యూనిట్ వర్గాలు తేల్చేశాయి. ఇప్పుడిదే అంశంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

'జనతా గ్యారేజ్ గురించి అన్ని అధికారికమైన వార్తలను ఈ ఐడీ ద్వారా ఈ పేజ్ లో అందిస్తాం. దయచేసి ఫేక్ అకౌంట్లను ఫాలో అయ్యి, రూమర్లను నమ్మకండి.' అంటూ ట్వీట్ చేశారు నిర్మాతలు. మైత్రి సంస్థ నుంచి వచ్చిన ఈ క్లారిటీతో జూనియర్ కు గాయాలయ్యాయనే వార్తలు రూమర్స్ అని తేలిపోయింది. జూనియర్ కు యాక్సిడెంట్ వార్తలు ఆందోళన కలిగించినా.. యూనిట్ నుంచి స్పష్టమైన ప్రకటన చేయడం, ఎన్టీఆర్ కు ఏం కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

జనతా గ్యారేజ్ మూవీలో జూనియర్ కు జంటగా సమంత - నిత్యామీనన్ లు నటిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఐఐటీ-ముంబై స్టూడెంట్ గా ఎన్టీఆర్ కనిపించనుండగా.. ఆగస్ట్ 12న విడుదల చేసేలా, ప్లాన్ చేశారు దర్శక, నిర్మాతలు.