Begin typing your search above and press return to search.
100 కోట్ల నిర్మాతలు.. 89 లక్షల మూవీ!!
By: Tupaki Desk | 30 Oct 2018 6:30 PM GMTఈమద్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థ పేరు మైత్రి మూవీస్. శ్రీమంతుడు, రంగస్థలం, జనతా గ్యారేజ్, సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ చిత్రాలను చేస్తున్న మైత్రి మూవీస్ వారు తాజాగా కోటి లోపు బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నారు. రంగస్థలం చిత్రంతో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వీరు కోటి లోపు బడ్జెట్ తో సినిమా అంటే అంతా కూడా షాక్ అవుతున్నారు. ఈమద్య టాలీవుడ్ లో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే మంచి కథను ఎంపిక చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా మైత్రి మూవీస్ నిర్మాతలు పేర్కొన్నారు.
రితీష్ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రితీష్ చెప్పిన కథ మరియు బడ్జెట్ ప్లాన్ అంతా కూడా మైత్రి వారికి నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కేవలం 89 లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ అన్నారు.
చిన్నా, పెద్దా అనే సినిమాలు కాకుండా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంతోనే తాము బ్యానర్ ను స్థాపించామని, ఆ ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నట్లుగా నవీన్ చెప్పుకొచ్చాడు. గతంలో ఈ సంస్థలో వచ్చిన సినిమాల ప్రమోషన్ ఖర్చులు కోట్ల రూపాయలు. కాని ఇప్పుడు కేవలం 89 లక్షలకే సినిమాను పూర్తి చేసి పబ్లిసిటీ ఖర్చులతో కలిపి కోటిన్నర పెట్టి విడుదల చేయబోతుండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దర్శకుడితో పాటు టెక్నీషియన్స్ కూడా అంతా కొత్త వారే ఈ చిత్రంకు పని చేయబోతున్నారు. మైత్రి వారు చేయబోతున్న ఈ ప్రయోగం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలను సురేష్ బాబు చేస్తున్న విషయం తెల్సిందే. మైత్రి వారు చేయబోతున్న సినిమా సక్సెస్ అయితే భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు వరుసగా చిన్న చిత్రాలను నిర్మించే అవకాశం ఉంది.