Begin typing your search above and press return to search.
పేమెంట్ లేకుండా వాళ్లిద్దరి సినిమా
By: Tupaki Desk | 6 Sep 2017 5:07 PM GMTటాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలను తీసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ. ఎన్నో వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా గత కొంత కాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్నాడు. అంతే కాకుండా అవకాశాలు కూడా తగ్గు ముఖం పట్టాయని అనుకుంటున్నా సమయంలో రవితేజ కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం రవితేజ దిల్ రాజు ప్రొడక్షన్ లో "రాజా ది గ్రేట్" మరియు రచయిత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ''టచ్ చేసి చూడు'' సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు రవి తేజ మరో రెండు సినిమాలను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన జయం రవి- భోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాను ఒరిజినల్ కథను తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కిస్తున్నాడట.
అలాగే గత కొన్ని రోజులుగా రవితేజ అండ్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. దర్శకుడు హీరో ఇద్దరు అపజయాల్లో ఉండడంతో మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చి వారి సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాకు ఇద్దరికి రెమ్యూనరేషన్ ని ఇవ్వడంలేదని తెలుస్తోంది. సినిమా నిర్మాణానికి మాత్రం ఒక బడ్జెట్ ని ఫిక్స్ చేసి సినిమా రిజల్ట్ ని బట్టి వారికి షేర్స్ ఇవ్వనున్నారట. మరి వీరి హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేసి రెమ్యునరేషన్ ని అందుకుంటారో లేదో చూడాలి.