Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత‌ల 'హీరో' ఎవ‌రో?

By:  Tupaki Desk   |   25 Aug 2018 5:25 PM GMT
ఆ నిర్మాత‌ల హీరో ఎవ‌రో?
X
ఏ సినిమాకైనా టైటిల్ క్యాచీగా ఉంటే ప్రేక్ష‌కుల‌కు ఈజీగా రీచ్ అవుతుంది. అందుకే, టాలీవుడ్ లో గ‌తంలో హిట్ అయిన చిత్రాల టైటిళ్లు కొన్నింటిని - త‌మ‌కు బాగా న‌చ్చిన క్యాచీ టైటిళ్ల‌ను ముందే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రిజిస్ట‌ర్ చేయించి పెట్టుకుంటారు. ఇదే కోవ‌లో తాజాగా, టాలీవుడ్ నిర్మాణ సంస్థ `మైత్రీ మూవీ మేక‌ర్స్` ఓ ఆస‌క్తిక‌ర టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన‌`హీరో` టైటిల్ ను ఆ సంస్థ రిజిస్ట‌ర్ చేయించింది. అయితే, ఈ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేసుకున్న మైత్రీ మూవీస్.... ఏ హీరోతో సినిమా చేయ‌బోతోంద‌న్న అంశం ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ లో దాదాపు ప‌ది చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. అందులో ఏ సినిమాకు ఈ టైటిల్ పెడ‌తార‌న్న‌ది ఆస‌క్త‌క‌రంగా మారింది.

టాలీవుడ్లో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న నిర్మాణ సంస్థ‌ల‌లో ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఒకటి. ‘శ్రీమంతుడు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఆ సంస్థ‌...‘జనతా గ్యారేజ్’ తో మ‌రో హిట్ అందుకుంది. ఇక‌, రాం చ‌ర‌ణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘రంగస్థలం’తో ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ సాధించింది. అదే ఊపుతో ఆ సంస్థ నుంచి దాదాపు పది సినిమాలు రాబోతున్నాయి. ‘సవ్యసాచి’ - ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ - ‘డియర్ కామ్రేడ్’.. ల‌తో పాటు సుకుమార్-మహేష్ బాబు సినిమా, మ‌రి కొన్ని సినిమాలు ఆ సంస్థ నిర్మిస్తోంది. అయితే, ఆల్రెడీ నితిన్ `హీరో`గా ఓసారి క‌నిపించాడు. ఆ టైటిల్ ను మహేష్-సుకుమార్ సినిమాకు ఉపయోగించ‌క‌పోవ‌చ్చు. మెగా మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల ఆ టైటిల్ ను వాడే అవ‌కాశాలు త‌క్కువ‌. క్లాస్ దర్శకుడిగా పేరున్న కిషోర్.. `చిత్రలహరి’ తీస్తాడని టాక్ ఉంది. దీంతో, మైత్రి బ్యాన‌ర్ లో `హీరో`ఎవ‌రోన‌ని ఆస‌క్తి మొద‌లైంది.