Begin typing your search above and press return to search.

మైత్రీ స‌క్సెస్..దిల్ రాజు ఫెయిల్‌!

By:  Tupaki Desk   |   17 Jan 2023 8:30 AM GMT
మైత్రీ స‌క్సెస్..దిల్ రాజు ఫెయిల్‌!
X
2023 సంక్రాంతి వార్ వ‌న్ సైడ్ గా మారిందా? అంటే ట్రేడ్ వ‌ర్గాలు చూపిస్తున్న లెక్క‌లు.. థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కులు కురిపిస్తున్న కాసులు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. ఈ సంక్రాంతి స‌మ‌రానికి మొత్తం ఐదు సినిమాలు సైర‌న్ మోగించాయి. అందులో రెండు అగ్ర క‌థానాయ‌కులు నంద‌మూరి బాల‌కృష్ణ‌, చిరంజీవి న‌టించిన `వీర సింహారెండ్డి`, `వాల్తేరు వీర‌య్య‌`. మూడ‌వ‌ది యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ న‌టించిన చిన్న సినిమా `క‌ల్యాణం క‌మ‌నీయం`.

ఇక రెండు త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన `వార‌సుడు`, అజిత్ న‌టించిన `తెగింపు`. ఇందులో నంద‌మూరి బాల‌కృష్ణ‌, చిరంజీవి న‌టించిన `వీర సింహారెండ్డి`, `వాల్తేరు వీర‌య్య‌` సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `వీర సింహారెండ్డి`ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తే.. చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌`ని జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేశారు. రెండు సినిమాల్లో బాల‌య్య‌ మూవీని గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తే చిరు `వాల్తేరు వీర‌య్య‌`ని బాబి డైరెక్ట్ చేశాడు.

అంచ‌నాలు పెరిగి పోవ‌డంతో ఈ రెండు సినిమాల బ‌డ్జెట్ లు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ రెండు సినిమాల‌ని కూడా మైత్రీ వారే నైజాంలో రిలీజ్ చేశారు. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి ఈ సినిమాల‌తో తొలి సారి అడుగుపెట్టారు. ఈ రెండు సినిమాల‌కు కావాల్సినంత ప‌బ్లిసిటీని చేశారు. అందు కోసం భారీగానే ఖ‌ర్చు చేశారు. దీంతో ఈ రెండు సినిమాల‌కు ఆశించిన దానికి మించి బ‌జ్ క్రియేట్ అయింది. దీంతో `వీర సింహారెడ్డి` అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డు క్రియేట్ చేసింది.

ఫ‌స్ట్ డే ఈ మూవీ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 25.35 కోట్ల మేర షేర్ ని రాబ‌ట్టింది. రెండ‌వ రోజు 5.25 కోట్లు ద‌క్కింయ‌చుకుంది. పండ‌గ సెల‌వులు కావ‌డంతో డివైడ్ టాక్ వున్న‌ప్ప‌టికీ ఈ మూవీ నాలుగు రోజులగా పాలు అదే హ‌వాని కొన‌సాగించింది. మూడ‌వ రోజు 7.25 కోట్లు, నాలుగ‌వ రోజు ఓవ‌ర్సీస్ లో 4.80 కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 52.65 కోట్ల షేర్ ని రాబ‌ట్టి 88.15 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేసింది. సినిమా మొత్తం టార్గెట్ 74 కోట్లు. బిజినెస్ చేసింది 73 కోట్లు. బ్రేక్ ఈవెన్ ని సాధించాలంటే 21. 35 కోట్లు రాబ‌ట్టాలి.

ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ మార్కుని చేరువైన ఈ మూవీ నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ ని రాబ‌ట్టింద‌ని చిత్ర బృందం చెబుతోంది. సోమ‌వారం కూడా పండగ వాతావ‌ర‌ణం వుండ‌టంతో వ‌సూళ్లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌` ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా మ‌రింత దూకుడుగా క‌నిపిస్తోంది. మొద‌ట్లో కొంత నెగెటివ్ టాక్ వినిపించినా ఓపెనింగ్స్ ప‌రంగా ఆ త‌రువాత రోజుల వ‌సూళ్ల పరంగా ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల ని రాబ‌డుతూ `వీర సింహారెడ్డి`ని అధిగ‌మించేసింది.

యుఎస్ లో కూడా `వీర సింహారెడ్డి`కి మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అక్క‌డ 1.7 మిలియ‌న్ మార్కుని చేరువ కావ‌డం విశేషం. త్వ‌ర‌లో 2 మిలియ‌న్ మార్కుని దాట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే ఈ మూవీ 47. 46 కోట్ల షేర్ ని, 76.80 కోట్ల గ్రాస్ ని ద‌క్కించుకుంది. రెస్టాఫ్ ఇండియాలో 3.90 కోట్ల షేర్ ని రాబ‌ట్ట‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా 60 కోట్ల‌కు పైగా షేర్ ని, 108 కోట్ల గ్రాస్ ని చేరుకోవ‌డం విశేషంగా చెబుతున్నారు. ఈ లెక్క‌ల ప్ర‌కారం సంక్రాంతి విజేత‌గా చిరు `వాల్తేరు వీర‌య్య‌` నిలిచింది.

మైత్రీ ఈ రెండు సినిమాల‌ని భారీ మొత్తాల‌కి ఇత‌ర ఏరియాల్లో అమ్మ‌డం.. అనుకున్న విధంగా రిక‌వ‌రీ అవుతుండ‌టంతో అంతా ఊప‌రి పీల్చుకుంటున్నారు. ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల‌తో పోటీకి దిగిన దిల్ రాజు మూవీ తెలుగులో డిజాస్ట‌ర్ అనిపించుకుంది. ముందు ఈ సినిమాల‌కు పోటా పోటీగా రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ త‌రువాత వ్య‌తిరేక‌త రావ‌డంతో వెన‌క్కు త‌గ్గాడు. 12న రిలీజ్ చేయాల‌నుకున్న `వార‌సుడు`ని 14కు పోస్ట్ పోన్ చేసిన విష‌యం తెలిసిందే. మైత్రీ వారితో పోటీప‌డాల‌ని పండ‌గ సీజ‌న్ లో దిగిన దిల్ రాజు `వార‌సుడు` కార‌ణంగా ఫెయిల్ అయ్యాడు. మైత్రీ వారు రెండు భారీ సినిమాల‌కు అగ్రెసీవ్ గా ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించారు.

అయితే దిల్ రాజు మాత్రం త‌మిళ వెర్ష‌న్ ని ప్ర‌మోట్ చేసినంత‌గా తెలుగులో ప్ర‌మోట్ చేయ‌లేక‌పోయాడు. హీరో విజ‌య్ స‌పోర్ట్ చేయ‌క‌పోవ‌డంతో దిల్ రాజు అనుకున్న విధంగా `వార‌సుడు` ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించ‌లేక‌పోయాడు. అదే ప్ర‌ధాన మైన‌స్ గా మారి వార్ వ‌న్ సైడ్ అయ్యేలా చేసింది. దీంతో సంక్రాంతి వార్ లో మైత్రీ వారి ముందు దిల్ రాజు ఫెయిల్ కావాల్సి వ‌చ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.