Begin typing your search above and press return to search.

మైత్రీ వర్సెస్ దిల్ రాజు - మళ్లీ సంక్రాంతికి విడుదల!

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:30 AM GMT
మైత్రీ వర్సెస్ దిల్ రాజు - మళ్లీ సంక్రాంతికి విడుదల!
X
అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. తగ్గేదే లే డైలాగ్ తో పాటు రారా సామి పాట విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం హిందీలోనే ఏకంగా వంద కోట్లు సంపాదించింది. అయితే దీనికి సీక్వెల్ అయిన్ పుష్ప-2 షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ సినిమాలో కూడా స్టైలిష్ స్టార్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలో కనిపించ బోతున్నారు. పుష్ప మొదటి పార్ట్ విడుదలైన ఏడాది తర్వాత పుష్ప-2 షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడమే లక్ష్యంగా షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

నైజాంలో మైత్రి బ్యానర్స్ ఈ సినిమాను సొంతంగా విడుదల చేస్తోంది. అలాగే హిందీలో కూడా మైత్రీ బ్యానర్స్ సొంతంగా (థర్డ్ పార్టీ సాయంతో)విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే పార్ట్ 1, పార్ట్ 2.. సినిమాలను రెండేళ్ల గ్యాప్ ఉండనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజ్ భావిస్తున్నారట. ఎర్ర చందనం, స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రారాజుగా రూల్ చేయడానికి అల్లు అర్జున్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు. గతేడాది డిసెంబర్ నెలలో 5 రోజుల్లో షూటింగ్ లో పాల్గొన్న స్టైలిష్ స్టార్.. ఈ వారంలో వైజాగ్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

పుష్ప ది రైజ్ లాగే పుష్ప టూని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో ఈ సినిమా విడుదల అయిన రోజే మిగతా దేశాల్లో కూడా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ సారి అంతకు మించిన స్థాయిలో పుష్ప-2 ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.