Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబో ఇప్పట్లో లేనట్లేనా...?

By:  Tupaki Desk   |   21 April 2020 4:30 PM GMT
ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబో ఇప్పట్లో లేనట్లేనా...?
X
'కేజీఎఫ్' సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం తెలుగు హీరోతో ఉంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్2' తర్వాత ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నెక్స్ట్ సినిమా కోసం ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుందని సమాచారం. అయితే దర్శకుడు ప్రశాంత్‌ ఎంచుకున్న కథకు ఎన్టీఆర్‌ ఒక్కరే సరైన వాడని నిర్ణయించుకున్నారట. కథను ఎన్టీఆర్‌ అంగీకరిస్తే ప్రశాంత్‌ తెలుగులో తీయబోయే మొదటి చిత్రం అవుతుంది. మరోవైపు ‘జనతా గ్యారేజ్’ సినిమా టైమ్‌ లోనే మైత్రీ మూవీ మేకర్స్ తారక్‌తో మరో సినిమాకు కమిట్‌మెంట్ తీసుకుంది. కాకపోతే దీనికి టైమ్ లిమిట్ అంటూ ఏది లేదు. కేజీఎఫ్ సెకండ్ పార్ట్ రిలీజ్ సమయానికి ఇటు ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్‌ నుంచి ఫ్రీ అయితాడు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇన్ని రోజులు అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమేనట.

అంతేకాకుండా ప్ర‌శాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా ఆగిపోయినట్లేనని కూడా రూమర్స్ వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే మైత్రీ మూవీ మేకర్స్ వారు ముందు మాదిరిగా ఒకే సారి రెండు మూడు భారీ సినిమాలు తీసేందుకు రెడీగా లేరట. కారణం వీరికి ఫండింగ్ వ‌చ్చే టీడిపీ వ‌ర్గీయులు కరోనా క్రైసిస్ కార‌ణంగా చాలా న‌ష్టాల్లో ఉన్నార‌ని.. అందుకే ఇప్పుడు ఒకేసారి పెద్ద ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టే సాహసం మైత్రీ మూవీ మేకర్స్ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ప్ర‌స్తుతం మైత్రీ మూవీస్ భుజానికి ఎత్తుకున్న 'పుష్ప‌'లో కూడా బ‌డ్జెట్ కోత‌లు పెడుతున్నారట. ఈ నేపథ్యంలో ప్ర‌శాంత్ నీల్ 'కేజీఎఫ్2' రిలీజ్ అయ్యాక‌ ఇచ్చిన క‌మిట్మెంట్ ని కూడా బ్రేక్ చేయ‌డానికి మైత్రీ మూవీస్ టీమ్ ఆలోచిస్తున్న‌ట్లుగా స‌మాచారం. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప త‌రువాత ఈ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేద్దామ‌ని.. అప్పటిదాకా ప్ర‌శాంత్ నీల్ ని వెయిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్లుగా ఫిల్మ్ వర్గాలవారు చెబుతున్నారు.

కానీ 'కేజీఎఫ్ 2' తరువాత హాట్ కేక్ మాదిరిగా ఈ డైరెక్ట‌ర్ డేట్స్ ఉంటాయి. మ‌రి ఇత‌ర పెద్ద సంస్థ‌లు ఏమైనా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎత్తుకెళ్లినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు. అంతెందుకు ఎన్టీఆర్ సొంతంగా తమ బ్యానర్ పై ఈ సినిమా తీసినా తీసేస్తాడు. ఇందుకు బ‌లమైన కార‌ణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ స్వంతగా తన తండ్రి హరికృష పేరు మీదుగా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మైత్రీ వాళ్ళు తప్పుకుంటే ఎన్టీఆర్ స్వయంగా ప్రశాంత్ తో సినిమా స్టార్ట్ చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు. మరి రానున్న రోజుల్లో ఈ నిర్మాణ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.