Begin typing your search above and press return to search.
ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్.. అసలేం జరిగిందంటే!
By: Tupaki Desk | 24 March 2021 6:35 AM GMTసోషల్ మీడియాలో సెలబ్రెటీలను నెత్తిన ఎత్తుకునే వారితో పాటు ట్రోల్స్ తో పాతాళానికి తొక్కే వారు కూడా చాలా మంది ఉంటారు. కొన్ని సార్లు అభిమానులే విమర్శలు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇవ్వడం లేదంటూ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో బ్యాడ్ ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల తరహాలో అందరు హీరోల అభిమానులు నిర్మాణ సంస్థలపై తమ హీరోల సినిమా లకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ పలు సినిమాలను నిర్మిస్తుంది. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాల అప్ డేట్స్ ఇవ్వాలంటూ కొందరు నెటిజన్స్ గత కొన్ని రోజులుగా తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారట.
సోషల్ మీడియాలో ఇలాంటి వారి వల్ల మంచి వాతావరణం చెడి పోతుందని అందుకే వారిని బ్లాక్ చేసేద్దాం రండీ అంటూ ట్విట్టర్ లో మైత్రి మూవీ మేకర్స్ పిలుపునిచ్చారు. ట్రోల్స్ మరియు పిచ్చి కామెంట్స్ చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో మైత్రి మూవీస్ వారు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న అందరిని కూడా బ్లాక్ చేస్తూ వస్తున్నారు. చేయి చేయి కలిపి సోషల్ మీడియా ను సంతోషంగా మార్చుదామంటూ పిలుపునిచ్చారు. తమ బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలకు సంబంధించి సందర్బానుసారంగా మైత్రి మూవీస్ వారు ఖచ్చితంగా అప్ డేట్ ఇస్తూనే ఉంటారు. అయినా కూడా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ముందు ముందు విమర్శలు చేసే వారు.. బ్యాడ్ కామెంట్స్ చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.