Begin typing your search above and press return to search.
నేనే యువరాణిని.. నా హృదయమే రాణివాసం
By: Tupaki Desk | 23 July 2017 9:41 AM GMTపొగమంచు తెరలు తెరలుగా అలముకున్న వేళ... నులివెచ్చని సూర్యకిరణాలు సుతారంగా తాకేవేళ... పువ్వులు విచ్చుకుని పలకరించే వేళ... ఇళయ రాజా సంగీతంలో ఓ తేటతెలుగు పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది. మెలోడి ప్రియులకు ఇళయ రాజా సంగీతంలో ఉన్న మాయగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్వరకల్పనలో ఎన్నో ఆణిముత్యాలు వచ్చాయి.
తాజాగా నారా రోహిత్ హీరోగా నటిస్తున్న కథలో రాజకుమారి సినిమాకు విశాల్ చంద్రశేఖర్ తో కలిసి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాకు ఇందులోని ‘నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేను’అనే పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తన హృదయాన్నే రాణివాసంగా చేసుకుని కళ్లలో ఎన్నో ఆశలు... గుండెల్లో ఎన్నో భావాలు దాచుకున్న కన్నెపిల్ల మనస్సును ప్రతిబింబించేలా సాగిన ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు సూరపనేని మహేష్ డైరక్షన్ చేస్తున్నారు. రాజకుమారి అందమైన చందమామ కథ చెబుతున్నట్టుగా సాగిపోయిన ఈ పాట చిత్రీకరణ కూడా చాలా ఆహ్లాదంగా సాగింది.
కథలో రాజకుమారి సినిమాలో నారా రోహిత్ పాటు మరో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్నాడు. జ్యో అచ్యుతానంద సినిమాలో ఇంతకుముందు వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరోసారి ఈ కాంబినేషన్ హిట్ రిపీట్ చేస్తుందేమో చూడాలి