Begin typing your search above and press return to search.
#బంగార్రాజు.. సిధ్ శ్రీరామ్ మ్యాజికల్ సాంగ్
By: Tupaki Desk | 5 Dec 2021 11:45 AM GMTకొత్తగా నాకేమైందో.. వింతగా ఏమో మొదలైందో.. అంతగా నాకర్థం కాలేదే!..మెరుపులా నీ చూపేమైందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీవైపే తిరిగిందే..
ఇంకో ఆశ రెండో ధ్యాశ లేకుండా చేశావు.. మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోశావు... నాకోసం మారావా నువ్వు.. లేక నన్నే మార్చేశావా నువ్వు!!
కళ్యాణ్ కృష్ణ కురసాల రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రంలోనిది ఈ క్లాసిక్ సాంగ్. ప్రతిభావంతుడు సిధ్ శ్రీరామ్ మ్యాజికల్ గానం .. అనూప్ రూబెన్స్ క్లాసికల్ మ్యూజిక్ ఈ పాటను ఎంతో ప్లెజెంట్ గా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పాటలో సాహిత్యం దానికి తగ్గ గాత్రం మ్యూజిక్ ఎంతో అద్భుతంగా కుదిరాయి. ఈ పాటలో నాగచైతన్య -కృతి శెట్టి నడుమ అద్భుతమైన రొమాన్స్ పండడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన లిరికల్ వీడియో వైరల్ గా దూసుకెళుతోంది.
నాగార్జున.. ప్లెజెంట్ లుక్..
టైమ్ ట్రావెల్ సినిమాలు చూశాం కానీ.. టైమ్ నే ఎదరించే హీరో సినిమాల్ని చూడలేదు. అంత స్పీడ్ గా బంగార్రాజును చిత్రీకరిస్తున్నారని సమాచారం. మేకర్స్ సమయంతో పోటీ పడుతున్నారు .. షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా 65శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల రాజమండ్రిలో షూటింగ్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ శరవేగంగా సన్నివేశాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. నాగార్జున- రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన హిట్ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ అయిన ఈ చిత్రంలో నాగార్జున లుక్ సంథింగ్ స్పెషల్ అని విజువల్స్ చెబుతున్నాయి. బంగార్రాజు మేకింగ్ విజువల్స్ లో నాగ్ తెల్ల కుర్తాలో ఎంతో ప్లెజెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. చుట్టూ పచ్చని పల్లె వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మనం లాంటి క్లాసిక్ తర్వాత నాగార్జున- నాగచైతన్య కాంబినేషన్ రిపీటవుతుండడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. తెరపై మరోసారి ఆ ఇద్దరి నడుమా సన్నివేశాలు ఏ రేంజులో పండనుందో వేచి చూడాలి.