Begin typing your search above and press return to search.

నష్టాల సునామీలో నానువ్వే

By:  Tupaki Desk   |   25 Jun 2018 4:11 AM GMT
నష్టాల సునామీలో నానువ్వే
X
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వరస మూడు ఫ్లాపుల తరవాత రిలీజైంది నా నువ్వే. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారిగా చేసిన రొమాంటిక్ మూవీ ఇది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించడం.. పాటలు కాస్త మెలోడియస్ గా ఉండి ఆకట్టుకోవడంతో రిలీజ్ కు ముందు కాస్త బజ్ వచ్చింది. తీరా రిలీజయ్యాక సినిమా ఏ మాత్రం బాగోలేదని తేలడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడటమే మానేశారు.

ఇప్పటికి నా నువ్వే బిజినెస్ క్లోజయింది. సినిమాకు ఖర్చు పెట్టింది.. వచ్చిన లెక్కలు చూస్తే డిజాస్టర్ అని తేలిపోయింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు రూ. 1.5 కోట్లు మాత్రమే. నానువ్వే మూవీని సీడెడ్ మినహా మిగతా ఏరియాలన్నింటిలో డైరెక్ట్ గానే రిలీజ్ చేశారు. ఒక్క సీడెడ్ లో మాత్రం రూ. 90 లక్షలకు అమ్మారు. కానీ అక్కడ వచ్చిందేమో రూ. 20 లక్షలు. అంటే డిస్ట్రిబ్యూటర్ కు నాలుగో వంతూ రాలేదు. ఈ మూవీ కోసం దాదాపు రూ. 7 కోట్లు ఖర్చుపెట్టారు. అంటే నిర్మాతకు టోటల్ లాసేనన్న మాట.

ఏరియా క్లోజింగ్ షేర్
నైజాం రూ. 26 లక్షలు
సీడెడ్ రూ. 20 లక్షలు
ఉత్తరాంధ్ర రూ. 18 లక్షలు
ఈస్ట్ రూ. 10 లక్షలు
వెస్ట్ రూ. 8 లక్షలు
కృష్ణా రూ. 10 లక్షలు
గుంటూరు రూ. 16 లక్షలు
నెల్లూరు రూ. 7 లక్షలు
మిగిలినవి రూ. 10 లక్షలు
ఓవర్సీస్ రూ. 25 లక్షలు
టోటల్ రూ. 1.5 కోట్లు


Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!