Begin typing your search above and press return to search.

నా పేరు సూర్య : నా షోలు ఐదు

By:  Tupaki Desk   |   2 May 2018 10:27 AM GMT
నా పేరు సూర్య : నా షోలు ఐదు
X
టాలీవుడ్ లో ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన రంగస్థలం, భరత్ అనే నేను వసూళ్ళలో అదనపు షోల పాత్ర చాలా ఉంది. తెలంగాణాలో లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వారం రోజుల పాటు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఒక అదనపు షో వేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో లెక్కల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. అందుకే రెవిన్యూ పరంగా ఈ సారి సీడెడ్ ఆంధ్ర ప్రాంతాల్లో షాకింగ్ ఫిగర్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పుడు వరసలో ఉన్న మరో సినిమా నా పేరు సూర్యకు కూడా లైన్ క్లియర్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 5 షోల చొప్పున మొత్తం 8 రోజుల పాటు ప్రదర్శనలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ జిఒ కూడా జారి చేసింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం వారం రోజుల పాటు నా పేరు సూర్యకు కలెక్షన్స్ సునామినే. కాని తెలంగాణాలో మాత్రం ఆ అవకాశం లేదు. ముందు చెప్పిన రెండు సినిమాలు కూడా హైదరాదాద్ లో సైతం ఉదయం 8 కంటే ముందే వేసిన దాఖలాలు లేవు.

టాక్ కనక పాజిటివ్ గా వస్తే ఈ అదనపు షోలు నా పేరు సూర్యకు ప్లస్ గా మారతాయి. కంటెంట్ యావరేజ్ అనిపించుకున్నా చాలు సెలవుల సీజన్ కాబట్టి బాగా రాబట్టుకోవచ్చు. బాగుంది అనే టాక్ వస్తే మాత్రం బన్నీకి బ్రేక్ వేయడం కష్టం. ఇప్పటికే బెనిఫిట్ షోల కోసం ఏర్పాట్లు టికెట్ల కోసం పైరవీలు మొదలయ్యాయి. డిజే తర్వాత కొంత గ్యాప్ తో వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు కూడా మామూలుగా లేవు. మిలిటరీ ఆఫీసర్ గా కొత్త తరహ పాత్రలో కనిపిస్తున్న బన్నీ దీని కోసం ఓ రేంజ్ లో కష్టపడ్డాడు. హెయిర్ స్టైల్ తో పాటు బాడీని కూడా రాటుదేల్చి మంచి ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ వచ్చాడు. మరి దీనికి ప్రతిఫలం ఏ స్థాయిలో ఉండబోతోందో మరో 36 గంటల్లో తేలిపోతుంది. వక్కంతం వంశీ డెబ్యు మూవీగా వస్తున్న ఈ మూవీలో అను ఇమ్మానియేల్ గ్లామర్ పెద్ద ప్లస్ గా కనిపిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ తమిళ హీరో శరత్ కుమార్ లతో తారాగణం భారీగా ఉన్న నా పేరు సూర్య విడుదల అయ్యాకే బన్నీ కొత్త సినిమా గురించి నిర్ణయం తీసుకోబోతున్నాడు.