Begin typing your search above and press return to search.

బడ్జెట్ 80 కోట్లు.. లాభం 20 కోట్లు

By:  Tupaki Desk   |   24 Dec 2017 10:30 AM GMT
బడ్జెట్ 80 కోట్లు.. లాభం 20 కోట్లు
X
చూస్తుండగానే ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు అల్లు అర్జున్. అతడి పారితోషఖం పెరిగిపోయింది. సినిమాల బడ్జెట్లు పెరిగాయి. బిజినెస్ పెరిగింది. వసూళ్లూ పెరిగాయి. బన్నీ గత సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ బడ్జెట్ రూ.60-70 కోట్ల మధ్య అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నాడు. ఇప్పుడు బన్నీ నటిస్తున్న కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ బడ్జెట్ ఏకంగా రూ.80 కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. హీరో అల్లు అర్జున్.. దర్శకుడు వక్కంతం వంశీ.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్.. సంగీత దర్శకులు విశాల్-శేఖర్.. మిగతా నటీనటులు.. టెక్నీషియన్ల పారితోషకాలకే సగానికి పైగా బడ్జెట్ అవుతోందట. ఇక ప్రొడక్షన్ పరంగా బన్నీ కెరీర్లోనే అత్యధికంగా ఈ చిత్రానికి ఖర్చు చేస్తున్నారట.

ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అనేక లొకేషన్లలో.. భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే బడ్జెట్ రూ.80 కోట్లకు చేరుకున్నట్లు తెలిసింది. ఐతే అంత బడ్జెట్ పెట్టి కూడా నిర్మాతలు రూ.20 కోట్ల దాకా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్ర శాటిలైట్.. డిజిటల్ హక్కులు మాత్రమే రూ.25 కోట్ల దాకా తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అంతటా కలిపి రూ.40 కోట్ల దాకా బిజినెస్ అవుతోందట. ఇక నైజాం రైట్స్ రూ.20 కోట్ల దాకా పలికే అవకాశముంది. ఇంకా ఓవర్సీస్ రైట్స్ ఉన్నాయి. మొత్తంగా బిజినెస్ ఈజీగా వంద కోట్లు దాటిపోతుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్.. బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్నారు. బడ్జెట్లో మేజర్ షేర్ మాత్రం శ్రీధరే పెడుతున్నట్లు సమాచారం.