Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ తో హీట్ పెంచేస్తున్నారు

By:  Tupaki Desk   |   3 April 2018 10:09 AM GMT
పోస్ట‌ర్ తో హీట్ పెంచేస్తున్నారు
X
స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కాబోతున్న చిత్రాల్లో భారీ అంచ‌నాలున్న సినిమాల్లో బ‌న్నీ ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ ఒక‌టి. ఒక్క టీజ‌ర్ తోనే ఆ అంచ‌నాలు ఆకాశానంటాయి. ఈ సినిమాలో బ‌న్నీ షార్ట్ టెంప‌ర్ ఉన్న ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ కొత్త పోస్ట‌ర్‌ ని విడుద‌ల చేసింది చిత్ర బృందం.

ఈ పోస్ట‌ర్ లో యాంగ్రీ ఆర్మీ ఆఫీస‌ర్ లుక్‌లో ర‌ఫాడిస్తున్నాడు బ‌న్నీ. ఎడమ కంటి మీద ఘాటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖం మీద చేతిపెట్టుకుని కోపంగా చూస్తున్న అల్లు అర్జున్‌... శ‌రీరంపై దేశంలోని న‌గ‌రాల పేర్ల‌ను క‌నిపించ‌కుండా ముద్రించారు. దీన్ని బ‌ట్టి చూస్తే ప‌క్కా ఆర్మీ ఆఫీస‌ర్ క‌థ‌గా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు అభిమానులు. దేశంలోని వివిధ న‌గ‌రాల్లో విధ్వంసం సృష్టించేందుకు తీవ్ర‌వాదులు ప్ర‌య‌త్నించ‌డం... దాన్ని ఆర్మీ ఆఫీస‌ర్ బ‌న్నీ త‌న టీంతో ఏ విధంగా అడ్డుకున్నాడ‌నేది ఈ సినిమా ప్ర‌ధాన క‌థ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లుఅర్జున్ స‌ర‌స‌న అనూ ఇమ్యానుయ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ... తొలిసారిగా ద‌ర్శ‌కుడిగా మారి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఏప్రిల్ 15న ఆడియో వేడుక నిర్వ‌హించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది చిత్ర బృందం. బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్ శేఖ‌ర్ నా పేరు సూర్య‌కు సంగీతాన్ని అందిస్తున్నారు.