Begin typing your search above and press return to search.

వావ్!! సూర్యలో లవర్ కూడా ఉన్నాడు

By:  Tupaki Desk   |   7 April 2018 1:22 PM GMT
వావ్!! సూర్యలో లవర్ కూడా ఉన్నాడు
X
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా.. ఈ మూవీ రిలీజ్ కు ఇంకా దాదాపు నెల రోజుల టైం ఉంది. అయినా సరే ఇప్పటికీ ఈ మూవీ ట్రెండింగ్ లో ఉండడానికి రీజన్.. బన్నీ ప్రస్తుతం ఉన్న అరివీర భయంకరమైన ఫామ్. కంటెంట్ బాగాలేదని క్రిటిక్స్ విమర్శించినా.. యావరేజ్ మూవీ అని జనాలు తేల్చేసినా.. తన సినిమాలో కనీసం 70 కోట్ల వసూళ్లను సాధించే రేంజ్ కు బన్నీ వచ్చేశాడు.

ఇప్పుడు నా పేరు సూర్య అంటూ సినిమాను రెడీ చేస్తున్నాడు బన్నీ. ఈ చిత్రానికి డైలాగ్ ఇంపాక్ట్ అంటూ తన బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అల్లు అర్జున్. ఇప్పటివరకూ సూర్య క్యారెక్టర్ కు సంబంధించి అన్నీ సీరియస్ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. కానీ ఈ సినిమాలో బన్నీ పాత్రకు ఓ లవర్ కూడా ఉంది. ఆ రోల్ లో అను ఇమాన్యుయేల్ నటిస్తోంది. మరి ఆర్మీలో ఉన్నంత సీరియస్ గా లవర్ తో ఉండడం కుదరదు కదా. అందుకే లవర్ బోయ్ గా మారిపోయాడు అల్లు అర్జున్.

బన్నీని లవర్ బోయ్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. దీంతో పాటే రేపు ఉధయం 10 గంటలకు డైలాగ్ ఇంపాక్య్ అంటూ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. లవర్ బోయ్ లుక్ లో బన్నీ స్టైలింగ్ అదిరిపోయింది. మే 4న నా పేరు సూర్య చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుండగా.. వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.