Begin typing your search above and press return to search.

అసలు నీ కథేంటి సూర్యా?

By:  Tupaki Desk   |   2 May 2018 6:37 AM GMT
అసలు నీ కథేంటి సూర్యా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య విడుదలకు 48 గంటల కంటే తక్కువ సమయమే ఉంది. బన్నీ ఫాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా తనను తాను పూర్తి మేకోవర్ చేసుకుని అల్లు అర్జున్ మిలిటరీ ఆఫీసర్ గా పరకాయ ప్రవేశం చేసిన తీరు గురించి ఇప్పటికే హాట్ టాపిక్ నడుస్తోంది. కాకపోతే ఇది ఏ జానర్ లో ఉంటుందా అనే అనుమానం మాత్రం పూర్తిగా తీరలేదు. టీజర్ మొదలుకుని ఇటీవలే వచ్చిన ట్రైలర్ దాకా ఇదేదో సీరియస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మిలిటరీ ఆఫీసర్ స్టొరీ అనుకుంటూనే వచ్చారు ఇప్పటి దాకా. కాని ఆడియో ఆల్బంలో రెండు లవ్ ట్రాక్స్ తో పాటు ఒక మాంచి మసాలా సాంగ్ కూడా ఉండటంతో లవ్ స్టొరీ ప్రధానంగా బ్యాక్ డ్రాప్ లో మిలిటరీ కథాంశాన్ని తీసుకున్నారా అనే సందేహం కూడా వచ్చింది. దీంతో కన్ఫ్యూజ్ అయిన బన్నీ ఫాన్స్ నా పేరు సూర్యని దేశభక్తి సినిమాగా ఎక్స్ పెక్ట్ చేయాలా లేక లవ్ మిక్స్ చేసిన యాక్షన్ మూవీగా ఆశించాలా అనే అయోమయంలో ఉన్నారు.

తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం ఇందులో తన కోపం తన కంట్రోల్ లో లేని సిన్సియర్ ఆఫీసర్ సూర్య క్యాంపులో కూడా అదే విధంగా ఉండటంతో అతన్ని భరించలేక పై అధికారి పాత్రలో ఉండే బోమన్ ఇరాని సూర్య తండ్రి యాక్షన్ కింగ్ అర్జున్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెబుతాడట. కాని అదంతా సులభంగా ఉండదు. అలా చేయాలి అంటే అర్జున్ బన్నీకి ఒక క్లిష్టమైన టాస్క్ ఇస్తాడు. అక్కడే శరత్ కుమార్ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఇదంతా ఫుల్ హ్యుమరస్ బన్నీ మ్యనరిజమ్స్ తో ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని తెలిసింది. వార్ ఎపిసోడ్స్ కథలో భాగమే అయినప్పటికీ అవి పావు గంటకు మించి ఉండవని తెలిసింది. మరి అను ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ ఎలా నడుస్తుంది తను బోమన్ ఇరాని కూతురా తదితర విషయాలన్నీ సస్పెన్స్. ఇవి అధికారికంగా వచ్చినవి కాకపోయినా అంచనాలను బట్టి చర్చ వీటి మీదే సాగుతోంది.

క్లారిటీ ఉన్నా లేకపోయినా డిఫరెంట్ జానర్ లో రూపొందిన నా పేరు సూర్య ఫీవర్ మెల్లగా పాకుతోంది. దేశభక్తి కాన్సెప్ట్ మీదే సినిమాను ప్రమోట్ చేసారు కాబట్టి ఫాన్స్ మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అల్లు అర్జున్ లుక్ తో పాటు అతని బాడీ లాంగ్వేజ్ కు సైతం మంచి రెస్పాన్స్ రావడం ట్రైలర్ తర్వాత అంచనాలు పెరగడం ప్లస్ అవుతున్నాయి. మొదటి సినిమానే ఇంత భారీ కాన్వాస్ తో తెరకెక్కిస్తున్న దర్శకుడు వక్కంతం వంశీ గురి తప్పదు అంటున్నాడు. ఫలితం మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.