Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ :ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంది

By:  Tupaki Desk   |   1 Jan 2018 12:12 PM GMT
టీజర్ టాక్ :ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంది
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా సర్ప్రైజ్ ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ నా పేరు సూర్య టీజర్ ని ఇందాకే యు ట్యూబ్ లో అఫీషియల్ గా రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ తో సరిపెడతారు అనుకుంటే ఏకంగా నిమిషానికి పైగా ఉన్న టీజర్ ని విడుదల చేయటం బన్నీ ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇక టీజర్ విషయానికి వస్తే హై ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ సీన్స్ తో మాస్ ని కూడా పర్ఫెక్ట్ గా టార్గెట్ చేస్తూ చాలా తెలివిగా కట్ చేసారు. కోపం నిలువెల్లా నిండిన మిలిటరీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ పాత్ర కొత్తగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఎవరు మిలిటరీ ఆఫీసర్ పాత్రలు చేయకపోవడం ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. దేశం కోసం దేన్నీ లెక్కచేయని తత్వం ఉన్న సూర్యగా అల్లు అర్జున్ బాగా సూట్ అయ్యాడు. అతని పాత్ర పరిచయాన్ని యాక్షన్ కింగ్ అర్జున్ వాయిస్ ఓవర్ లో చెప్పించిన వక్కంతం వంశం సినిమా దేని గురించో చెప్పకనే చెప్పాడు.

మిలిటరీ క్యాంపులో సూర్య చూపే తెగువ, శత్రువుల మీద అతనికి ఉండే కోపం అన్ని మిక్స్ చేసి వంశీ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది - దేశభక్తినే ఎమోషన్ గా వాడుకోవడం కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సీనియర్ అర్జున్ బన్నీ కి ట్రైనింగ్ ఇచ్చే సీనియర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. కఠినమైన ట్రైనింగ్ ఇస్తూ సూర్యని మౌల్ద్ చేసే పాత్రలో ఆయన ఉండే అవకాశాలు ఉన్నాయి . చనిపోవాల్సి వస్తే బోర్డర్ కు వెళ్లి చచ్చిపోతాను అన్న బన్నీ ఫినిషింగ్ టచ్ అన్నిటికన్నా మేజర్ హై లైట్. విశాల్ శేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. అను ఇమ్మానియేల్ ని ఎక్కువగా రివీల్ చేయకుండా తెలివిగా ప్లాన్ చేసారు. గొంతు వినిపించింది కాని సీనియర్ అర్జున్ లుక్ మాత్రం ఇందులో చూపలేదు. షార్ట్ గా కట్ చేసిన మిలిటరీ స్టైల్ హెయిర్ తో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు. సమ్మర్ లో భీభత్సమైన యాక్షన్ తో ఫాన్స్ కే కాదు సినిమా లవర్స్ కి కూడా యాక్షన్ ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాడు సూర్య.