Begin typing your search above and press return to search.
బన్నీ సినిమా ఎంత తెస్తుందో?
By: Tupaki Desk | 15 Feb 2018 11:24 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రూ.50 కోట్లను ఈజీగా దాటేస్తున్నాయి. అందుకు సమయం కూడా ఎక్కువగా పట్టడం లేదు. గత కొంత కాలంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మార్కెట్ ను ప్రతి సినిమాకు పెంచుకుంటూ వెళుతున్నాడు. గత సినిమాలు సరైనోడు - డీజే సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అందించాయి. ఆ సినిమాకు పని చేసిన దర్శకుల మార్కెట్ కూడా అందుకు తోడయ్యింది.
అయితే ఇప్పుడు బన్నీ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా అనే సినిమాపై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. మంచోడు చెడ్డోడిగా మారితే ఏ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాడో.. ఆ విధంగా రచయిత దర్శకుడిగా మారితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం కాయం అనేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చాలా వరకు రచయితలు మంచి సినిమాలను తీయగలరని చెప్పవచ్చు. దీంతో బన్నీ సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. సినిమా మార్కెట్ 100 కోట్లు దాటడం పక్కాగా అనిపిస్తోంది.
సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే త్రియేటికల్ రైట్స్ మొత్తంగా 80 కోట్లకు అమ్ముడుపోతోంది. నైజాం ఏరియాలో మొదటి సారి బన్నీ సినిమా భారీ ధర పలికింది. 21.5 కోట్లకు క్యాంటీన్ ప్రసాద్ దక్కించుకొని ఏషియన్ ఫిలిమ్స్ తో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఒక వేల సినిమా నైజాంలో 25 కోట్లను దాటితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.1.5కోట్లని నిర్మాతలకు అందించాల్సి ఉంటుంది. మరి ఈ స్తాయిలో అమ్ముడుపోతోన్న ఈ సినిమా ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.