Begin typing your search above and press return to search.

ఆమె పాడితే ఉగ్రవాద చర్య అంటున్నారు

By:  Tupaki Desk   |   31 July 2019 9:41 AM GMT
ఆమె పాడితే ఉగ్రవాద చర్య అంటున్నారు
X
ఉత్తరాది సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ కు డించక్‌ పూజా సుపరిచితురాలు. సోషల్‌ మీడియాలో ఈమె చేసే హడావుడి మామూలుగా ఉండదు. కొన్ని లక్షల పాలోవర్స్‌ ను సొంతం చేసుకున్న ఈమె ఏమైనా వీడియోలు బాగా చేస్తుందా అదీ లేదు. అడ్డ దిడ్డంగా పాటలు పాడుతూ చిన్న పిల్లలు చూస్తే భయపడే విధంగా డాన్స్‌ వేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె పాగల్‌ హోకే నాచో.. నాచ్‌ కే పాగల్‌ హో జావో అంటూ ఒక పాట పాడుతూ దానికి తగ్గట్లుగా డాన్స్‌ వేసింది.

ఆ పాట అత్యంత చెత్తగా ఉన్నా కూడా యూట్యూబ్‌ లో ఆ పాట ట్రెండ్‌ అవుతుంది. అత్యంత దారుణంగా డించక్‌ పూజా గురించి విమర్శలు వస్తున్నాయి. చిత్ర విచిత్రంగా ఆమెను ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ పాటను యూట్యూబ్‌ లో రిపోర్ట్‌ చేస్తున్నారు. చాలా మంది రకరకాల కారణాలు చూపుతూ రిపోర్ట్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం దీన్ని ఉగ్రవాద చర్యగా రిపోర్ట్‌ చేయాలనుకుంటున్నాను.. యూట్యూబ్‌ వారు ఆ అవకాశం నాకు కల్పించండి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇక మరో వ్యక్తి నాకు ఎక్కువగా కాల్స్‌ రాకుండా ఉండేందుకు ఈమె పాటను కాలర్‌ ట్యూన్‌ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాటను వినలేక ఎవరు కూడా నాకు మళ్లీ మళ్లీ కాల్‌ చేయరు అంటూ అతడు కామెంట్‌ చేశాడు. మొత్తానికి డించక్‌ పూజా పాట అత్యంత దరిద్రంగా ఉన్నా కూడా బాగా ఫేమస్‌ అయ్యింది. ఇలాంటి చెత్త వీడియోల కారణంగా సోషల్‌ మీడియాలో ఈ పూజా బాగా పాపులర్‌ అయ్యింది.