Begin typing your search above and press return to search.
మణిశర్మకు పడిపోయిన నారా బాబు
By: Tupaki Desk | 26 July 2017 10:18 AM GMTనారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’కు సంగీత దర్శకుడు మణిశర్మ. ఆ సినిమాకు చక్కటి పాటలు.. నేపథ్య సంగీతంతో బలంగా నిలిచాడు మణి. ఆ తర్వాత రోహిత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘సోలో’ సినిమాకు కూడా మణిశర్మే సంగీతాన్నందించాడు. ఆపై రోహిత్ వరుసగా తన సినిమాలకు సాయి కార్తీక్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ సీనియర్ సంగీత దర్శకుడికే ఓటేస్తున్నాడు రోహిత్. నారా వారబ్బాయి నటించిన మూడు సినిమాలకు వరుసగా మణిశర్మే సంగీత దర్శకుడు కావడం విశేషం.
నారా రోహిత్ మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’కి మణిశర్మే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మణి నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక నారా రోహిత్ పుట్టిన రోజు కానుకగా మోషన్ పోస్టర్ లాంచ్ తో ప్రేక్షకుల్ని పలకరించిన ‘బాలకృష్ణుడు’కు కూడా మణిశర్మే మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ మోషన్ పోస్టర్లోనే మణిశర్మ ప్రత్యేకత కనిపించింది. దీని తర్వాత రోహిత్ ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరితో మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ లాంచ్ చేశారు. ఆ పోస్టర్ మీద కూడా మణిశర్మ పేరే కనిపించింది. అంటే తక్కువ వ్యవధిలో రోహిత్ తో మూడు సినిమాలు చేస్తున్నాడన్నమాట మణిశర్మ. మధ్యలో ఫామ్ కోల్పోయి మరుగున పడిపోయిన మణిశర్మ.. ఈ మధ్య మళ్లీ పుంజుకున్నాడు. ‘జెంటిల్ మన్’.. ‘ఫ్యాషన్ డిజైనర్’.. ‘అమీతుమీ’.. ‘శమంతకమణి’ లాంటి సినిమాలు ఆయనలో ఇంకా సత్తా తగ్గలేదని రుజువు చేశాయి.