Begin typing your search above and press return to search.
‘నాటు నాటు’ కు అయినా ఆస్కారం ఉందా?
By: Tupaki Desk | 9 Oct 2022 11:30 PM GMT95వ అకాడమీ అవార్డుల నామినేషన్లు 2023 జనవరి 24న ప్రకటించనున్నారని సమాచారం. ఈసారి భారతదేశం నుంచి జూరీ ఒక చిన్న సినిమాని ఎంపిక చేసింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) పాన్ నీలన్ `చెలో షో`(లాస్ట్ ఫిల్మ్ షో)ని ఆస్కార్ కు దేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఈ గుజరాతీ చిత్రం గత రెండు సంవత్సరాలుగా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అనేక అవార్డులను కైవసం చేసుకుంది.
ఈ చిత్రం దేశవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్ లలో 2022 అక్టోబర్ 14న విడుదల కానుంది. మరోవైపు భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల కాని సినిమాను ఎంపిక చేయడంపై చాలా మంది నెటిజనులు అసంతృప్తి వ్యక్తం చేసారు. భారీ పాన్ ఇండియా చిత్రం RRR ఆస్కార్ బరిలోకి అధికారిక ప్రవేశిస్తుందని తెలుగువారు ఆశించినా కానీ అది జరగకపోవడం నిరాశకు గురి చేసింది.
RRR అనేక విభాగాలలో ఆస్కార్ నామినేషన్లకు సమర్పించినా కానీ పోటీ పడుతున్న చిత్రాల జాబితాలో కంటెంట్ పరంగా కొంచెం తక్కువగా ఉందని ప్రచారమైంది. అయితే ఈ చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించింది. మాస్ ని ఎక్కువగా రీచైంది. అమెరికా బ్రిటన్ నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే కొంతలో కొంత బెటర్ గా ఇప్పుడు ఒక కొత్త చర్చ సాగుతోంది. ఈ సినిమాకు ఒక్క నామినేషన్ వచ్చే అవకాశం ఉందని అది `బెస్ట్ ఒరిజినల్ సాంగ్` కేటగిరీ అని టాక్ తాజాగా వినిపిస్తోంది. `నాటు నాటు` పాటకు అందుకు ఆస్కారం ఉందని ఊహిస్తున్నారు. ఇది అనేక డ్యాన్స్ రీల్స్ ను అప్ లోడ్ చేయడంతో పాటు పబ్ లలో కూడా ఆ పాటను ఆస్వాధించడంతో అంతర్జాతీయంగా పాపులరైంది. అంతర్జాతీయ DJలు అనేక ప్రముఖ ఈవెంట్ లలో `ఊ అంటావా ఊ ఊ అంటావా`తో పాటు `నాటు నాటు`ను కూడా ఉపయోగించడంతో మార్మోగింది.
అందుకే నాటునాటుకు ఆస్కార్ కు నామినేట్ అవుతుందని నెటిజనులలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ కంపోజర్ కీరవాణితో పాటు గాయకుడు కాల భైరవ - రాహుల్ సిప్లిగంజ్- గీత రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ పాటకు పని చేసారు. పాట నామినేట్ అయితే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఆర్.ఆర్.ఆర్ ఒక్క ఆస్కార్ సాధించినా అది ఎంతో గొప్ప విషయంగా పరిగణించవచ్చు.
ఆస్కార్ జూరీ లు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని నామినేషన్లకు ఎంపిక చేస్తాయి. చెలో షో చిత్రంలో చాలా ఎమోషన్లు లైఫ్ జర్నీని జూరీ పరిశీలించి ఎంపిక చేసుకుంది. అక్టోబరు 14న థియేటర్లలోకి రాబోతున్న గుజరాతీ చిత్రం `చెలో షో` 35 ఎంఎం థియేటర్లలో వీక్షించవచ్చు. ఈ చిత్రంలో భవిన్ రాబరి- భవేష్ శ్రీమాలి- రిచా మీనా- దిపెన్ రావల్- పరేష్ మెహతా నటించారు. ఇది 2021లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. అక్టోబర్ 2021లో 66వ వల్లాడోలిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో `ఛెల్లో షో` గోల్డెన్ స్పైక్ పురస్కారాన్ని గెలుచుకుంది.