Begin typing your search above and press return to search.
మాటల్లేవు... నాటు నాటుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై జక్కన్న స్పందన
By: Tupaki Desk | 11 Jan 2023 5:50 AM GMTఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ విడుదల అయినప్పటి నుండి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. మొదట పాటలోని ఇద్దరు హీరోల డాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. పాట మెల్ల మెల్లగా ఎక్కుతూ వచ్చింది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నాటు నాటు అంటూ సినీ ప్రేమికులు కాళ్లు కదిపారు.
అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఈ పాటకు రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం పట్ల దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ అవార్డు పై ఆర్‌ఆర్ఆర్ క్రియేటర్ టాలీవుడ్ జక్కన్న స్పందించారు. ఆయన ట్విట్టర్ లో మాటల్లేవు అన్నట్లుగా దండం ఈమోజీని షేర్ చేశారు.
నిజంగా మ్యూజిక్ కి సరిహద్దులు అనేవి ఉండవని నిరూపితం అయ్యింది. కంగ్రాట్స్ మరియు థాంక్యూ పెద్దన్న అంటూ రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
నాటు నాటు సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తమ కాళ్లను కదిలించారు. అంతగా కదిలించేలా చేసిన పెద్దన్నకు కృతజ్ఞతలు అన్నట్లుగా రాజమౌళి ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
నాటు నాటు సాంగ్ కు అంతర్జాతీయ పురష్కారం రావడం పట్ల చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.