Begin typing your search above and press return to search.

నభ.. అన్నీ ఉన్నాయి కానీ ఆఫర్లేవీ?

By:  Tupaki Desk   |   6 Nov 2019 8:28 AM
నభ.. అన్నీ ఉన్నాయి కానీ ఆఫర్లేవీ?
X
ఫిలిం ఇండస్ట్రీలో విజయానికి ఉన్నంత విలువ మరోదానికి ఉండదు. పాత సినిమాలు మిక్సీలో వేసి సినిమాలు తీసినా.. అద్బుతంగా ప్రతిసారీ కళాఖండాలు తీసినా.. ఏం చేసినా హిట్లయితేనే దర్శకులకు అవకాశాలు వస్తాయి. అదే హీరోయిన్ల విషయానికి వస్తే హిట్ ఉంటే చాలు మిగతా విషయాలతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తాయని అనుకుంటారు. కానీ అది కూడా నిజంకాదని నభా నటేష్ విషయంలో నిరూపితమవుతోంది.

నభ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు కానీ సుధీర్ బాబుతో నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో 'ఇస్మార్ట్ శంకర్' లో అవకాశం వచ్చింది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరైనా.. రామ్ కు దీటుగా రఫ్ గా బోల్డ్ గా నటించి అందరినీ ఆకట్టుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటివరకూ ఒక్క మంచి ఆఫర్ కూడా రాలేదట. పెద్ద హీరోలేమో నభ పేరును పరిశీలించడం లేదట. యువ హీరోలేమో తమ సినిమాలకు కొత్త హీరోయిన్లను ఎంచుకుంటున్నారట. దీంతో నభకు కాల్సే రావడం లేదట.

తప్పంతా వారిదే అని చెప్పడం కూడా సరి కాదు. ఎందుకంటే నభ తన రెమ్యూనరేషన్ కూడా కొంచెం ఎక్కువే కోట్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఒక సినిమాకు నభ రూ. 50 లక్షలకు పైగా డిమాండ్ చేస్తుండడం కూడా ఆఫర్లు రాకపోవడానికి ఒక కారణమట. మరి ఆ భారీ ఫీజు తగ్గించుకుంటే పరిస్థితి మెరుగవుతుందేమో..! అయితే నభా చేతిలో అసలేమీ ఆఫర్లు లేవనుకోకండి. ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తోంది. ఇది ఎప్పుడో ఒప్పుకున్న సినిమా. ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. ఇస్మార్ట్ హిట్ సాధించి కూడా ఆఫర్లు లేకపోవడం మాత్రం ఫాఫం కదా.. అదేనండీ పాపం!