Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బిగి అందాల జిగిబిగి

By:  Tupaki Desk   |   16 Sep 2018 2:30 PM GMT
ఫోటో  స్టోరీ: బిగి అందాల జిగిబిగి
X
జిగిబిగి అందాల ఓ రాణి .. నీలో ఏదో దాగి ఉన్న‌దీ! అని యూత్ ఒక‌టే ఖుషీ అయిపోతున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ జిగిబిగి అందాల భామ‌? అంటే న‌వ‌త‌రం క‌థానాయిక న‌భా న‌టేష్‌. చూడ‌టానికి ప‌క్కింట‌మ్మాయిలా క‌నిపించే ఈ అమ్మ‌డిలో ఇంత ట్యాలెంటు ఒకేసారి బ‌య‌ట‌ప‌డుతుంద‌నుకోలేదు. సైమా అవార్డు వేడుక‌ల్లో ఇలా త‌ళుకుబెళుకుల్ని ప్ర‌దర్శించింది.

న‌భా అందాల్ని ఎలివేట్ చేసేందుకు డిజైన‌ర్ ఎత్తుగ‌డ ఫ‌లించింది. ఆ ఎద అందాల్ని అంతే బిగించేసిన క్లాస్సీ టాప్ - దానికి కాంబినేష‌న్‌ గా డార్క్ బ్లూ క‌ల‌ర్ ముఖ‌మ‌ల్ ప‌రికిణీ హైలైట్‌. ఆ ప‌రికిణీ ఆద్యంతం ర‌క‌ర‌కాల డిజైన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. అందులో తాజ్ మ‌హ‌ల్‌ - ఈపిల్ ట‌వ‌ర్‌ - జీస‌స్ స‌హా ఎన్నో ప్రాచీన‌ క‌ళాకృతులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. డిజైన‌ర్ ఎంత‌గా ఆలోచించి వీటిని డిజైన్ చేశారో కానీ ప్ర‌పంచంలోని ఏడు వింతల్ని ప‌రికిణీ మీద డిజైన్ చేసేయ‌డం ఇంట్రెస్టింగ్. ఇక వాట‌న్నిటినీ డామినేట్ చేస్తూ ప్ర‌పంచంలోని ఎనిమిదో వింత‌వా? అని న‌భాని యూత్ అడిగేసే లెవ‌ల్లో ఎక్స్‌పోజ్ చేసింది.

ఈ భామ‌ను ఇలా చూశాక అయినా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పిలిచి అవ‌కాశాలివ్వ‌రంటారా? ఈ క‌న్న‌డ భామ ఆనంద్ అనే క‌న్న‌డ సినిమాలో న‌టించింది. ప‌టాకా పార్వ‌తిగా పాపుల‌రైంద‌క్క‌డ‌. ఆ త‌ర్వాత సుధీర్ బాబు స‌ర‌స‌న `న‌న్ను దోచుకుందువ‌టే` (21న రిలీజ్‌) చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ లో న‌భా న‌ట‌న ఆక‌ట్టుకుంది. జోరున్న ఈ అమ్మ‌డికి మునుముందు తెలుగులో అవ‌కాశాలు ద‌క్కుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఇదిగో సైమాలో న‌భా అద‌ర‌హో అన్న చందంగా చెల‌రేగిపోయింది. ఇలా చూశాక ఆ నెక్ట్స్ ఛాన్సేదో ఇవ్వ‌కుండా ఆగుతారంటారా?