Begin typing your search above and press return to search.
అందం అభినయం కలగలిస్తే నభా
By: Tupaki Desk | 23 Sep 2021 5:30 PM GMTటాలీవుడ్ లో అత్యంత వేగంగా స్టార్ డమ్ అందుకున్న నాయికగా నభా పాపులరైంది. కన్నడ సోయగం నభా నటేష్ `వజ్రకాయ` మూవీతో హీరోయిన్ గా కన్నడ నాట ఎంట్రీ ఇచ్చింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయాన్నిసాధించడంతో తొలి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో సుధీర్ బాబు నటించిన `నన్ను దోచుకుందువటే` మూవీతో పరిచయమైంది.
ఈ మూవీలో నభా నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో తొలి సినిమా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టడంతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. మాస్ రాజా రవితేజతో డిస్కోరాజా..సాయిధరమ్ తేజ్ తో `సోలో బ్రతుకే సో బెటర్`.. బెల్లంకొండ శ్రీనివాస్ తో `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించింది.
తాజాగా నితిన్ నటించిన `మాస్ట్రో`లో మెరిసింది. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుని ప్రేక్షకుల్ని అలరిస్తోంది. చూపు తిప్పుకోలేని అందాలు.. ఆ అందానికి తగ్గట్టు అభినయం కలబోసిన ఈ కన్నడ కస్తూరి తెలుగులో తన సత్తా చాటుకోవాలని స్టార్ హీరోలందరితో కలిసి నటించాలని ప్రయత్నాలు చేస్తోంది. `మాస్ట్రో` తరువాత నభా చేతిలో ఇప్పటి వరకైతే మరో చిత్రం ప్రకటించ లేదు. కొన్ని చర్చల దశలో ఉన్నాయని తెలిసింది. ఏదైనా క్రేజీ ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.