Begin typing your search above and press return to search.

రాజ ప్రాకారంలో రాస‌లీల‌ల ర‌స‌గుళిక‌

By:  Tupaki Desk   |   19 April 2022 4:30 PM GMT
రాజ ప్రాకారంలో రాస‌లీల‌ల ర‌స‌గుళిక‌
X
ట్రెడిష‌న‌ల్ లుక్.. స‌భ్య‌సాచి లుక్.. అంటూ ఇటీవ‌ల ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్స్ తో మ‌తులు చెద‌ర‌గొడుతున్నారు యువ‌నాయిక‌లు. నేటిత‌రం ఫ్యాష‌న్స్ లో భారీత‌నం నిండిన డిజైన్స్ కి ఆక‌ర్ష‌ణ ఎక్కువే. డిజైన‌ర్ టాప్స్ లెహంగాల‌పై భారీ డిజైన‌ర్ వ‌ర్క్ .. క్రిస్ట‌లైన్ అల్లిక‌ల‌తో అద్భుత‌మైన అప్పియ‌రెన్స్ ని తెస్తున్నాయి లేటెస్ట్ ఫ్యాష‌న్స్. తాజాగా అలాంటి ఓ లుక్ లో ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ మెరుపులు మెరిపించింది.

చీర‌లో అయినా జీన్స్ లో అయినా బికినీలో అయినా ఎందులో అయినా ఒదిగిపోయే న‌భా స్టైలే వేరు. వంద శాతం ఎక్స్ ప్రెస్సివ్ బ్యూటీగా న‌భాకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. నేటిత‌రంలో ఎంత పోటీ పెరుగుతున్నా న‌భా కి కెరీర్ ప‌రంగా ఏ ఢోఖా లేదు అంటే త‌న‌లో ఉన్న ఈ వైబ్రేష‌నే అన‌డంలో సందేహం లేదు. నుదిటిన పాపిడి బొట్టు .. ముక్కుకు ముక్కెర లాంగ్ లెహంగాతో న‌భా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా కుర్ర‌కార‌లో వైర‌ల్ గా మారాయి. న‌భా హొయ‌లు హీటెక్కిస్తున్నాయి.. ట్రెడిష‌న‌ల్ లుక్ లోనూ అద‌ర‌గొడుతోంది! అంటూ యూత్ జోరుగా కామెంట్లు చేస్తున్నారు. న‌భా రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లింద‌న్న వ్యాఖ్య‌లు కొన్ని వైర‌ల్ అవుతున్నాయి.

న‌భా న‌టేష్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `ఇస్మార్ట్ శంక‌ర్` తో లైమ్ లైట్ లోకి వ‌చ్చిన ఈ బ్యూటీ`డిస్కోరాజా`..`అల్లుడు అదుర్స్`..`మాస్ట్రో` చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించింది. అన్ని పెద్ద ప్రాజెక్ట్ లే. కానీ వైఫ‌ల్యాలు ఎదుర‌య్యాయి. ఇక `ఇస్మార్ట్ శంక‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఈ బ్యూటీ పారితోషికం భారీగా పెంచేసిందని గుస‌గుస‌లు వినిపించాయి. `ఇస్మార్ట్ శంక‌ర్` త‌ర్వాత చేసిన సినిమాల‌న్నింటికి భారీగానే వ‌సూలు చేసింద‌ని టాక్ వినిపించింది. ఈ కార‌ణం తో ద‌ర్శ‌క‌.. నిర్మాత‌లు దూరం పెట్టార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఇంత‌లోనే న‌భా వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. న‌భా న‌టేష్ తొంద‌ర్లోనే మ‌రో భారీ ప్ర‌క‌ట‌న‌తో దూసుకురాబోతోంద‌ట‌.