Begin typing your search above and press return to search.
ప్రభుత్వం విధానాలు నచ్చలేదంటున్నహీరోయిన్
By: Tupaki Desk | 29 Nov 2017 6:14 AM GMTనచ్చావులే సినిమాతో తెలుగు సినీ రంగంలో తెరంగేట్రం చేసిన హీరోయిన్ మాధవీలత ఇటీవలి కాలంలో కొన్ని సామాజిక అంశాలపై చురుకుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేకెత్తించిన కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తను సినీరంగంలోకి వచ్చిన సమయంలో డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని సహనటుడు ఒకరు ఏకంగా డేటింగ్‌కు రావాలని పిలిచారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి వాటన్నింటినీ తాను తిరస్కరించడం వల్లే అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పుకొచ్చారు. కాగా తాజాగా మరో కీలక అంశంపై మాధవీలత స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా హైదరాబాద్ పర్యటన, ఏర్పాట్లపై మాధవీలత స్పందిస్తూ...ఇవాంకా కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లే...మన వాళ్లు అమెరికా వెళ్లినప్పుడు ఇలాగే చేస్తారా అని ప్రశ్నించారు. `ఇవాంకా ట్రంప్ వస్తుందంటే క్లీనింగ్స్, పెయింటింగ్స్...ట్రాఫికి మళ్లింపు ఇలా ఎంతో హడావిడి చేశారు. కానీ మనవాళ్లకు ఇలాంటి గౌరవం దక్కుతుదా? అమెరికాకు మన ప్రెసిడెంట్ వెళ్లినా కొత్తగా వాళ్లేమీ చేయరు. ఎందుకు? అంటే మన వాళ్లకి మర్యాద చేయడం వాళ్లకి తెలీదా? రాదా? లేక కొత్తగా హడావిడి చేసే అవసరం లేదా? అక్కడ ప్రజలందరి కోసం ఒకే రోడ్స్ ఉంటాయేమో.. దీనర్థం మనకు డెవలప్‌మెంట్ ఇంకా ఇంకా ఇంకా అవ్వాలి అని అర్థమైంది కదా`` అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరుపై మాధవీలత అసహనం వ్యక్తం చేశారు. మన దేశంలో వీఐపీ ప్రాణాలకు తప్ప మామూలు మనుషులవి ప్రాణాలు కాదన్నట్లుగా పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మన జీవన విధానాన్ని చూసి తాను సిగ్గుపడుతున్నానని మాధవీలత అన్నారు. `వీఐపీలు వచ్చినప్పుడే ఏర్పాట్లు ఉంటాయి. మధ్యలో పోలీస్ ఓవర్ యాక్షన్.. సెక్యూరిటీ రీజన్స్ ఎలాగూ ఉండేవే. ఎవరో వస్తున్నారని రోడ్లు వేస్తే అలా అయినా వేశారు కదా అనే ఆనందం. ఏంటో ఖర్మ! వీఐపీలు వచ్చి మనకు ఏం ప్రాజెక్టులు తెస్తారో తెలీదు కానీ మామూలు ప్రజల కష్టాలు ఎన్నో.. అయినా మనకు సిగ్గు లేదు.. అదే నాయకులకు ఓట్లు వేస్తాం. నా పోస్ట్ ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకు అనవసరం. నాకు మన ప్రభుత్వం విధానాలు నచ్చలేదు అంతే!` అంటూ నిష్కల్మషంగా తన మనసులోని భావాలను వెల్లడించారు.