Begin typing your search above and press return to search.

'ది కాశ్మీర్ ఫైల్స్' అసభ్యక‌ర‌ చిత్రం ప‌బ్లిసిటీ కోస‌మే?!

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:04 AM GMT
ది కాశ్మీర్ ఫైల్స్ అసభ్యక‌ర‌ చిత్రం ప‌బ్లిసిటీ కోస‌మే?!
X
గోవాలో IFFI ఉత్సవాల ముగింపు వేడుకలో ఉత్స‌వాల‌ జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ కామెంట్ సంచ‌ల‌నంగా మారింది. వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన‌ సంచ‌ల‌న చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' పై ఆయ‌న వ్యాఖ్య‌లు దుమారంగా మారాయి.

ఈ సినిమాని అత‌డు ''అసభ్యక‌ర‌మైనది-అనుచితమైనది'' అని అభివర్ణించారు. ఈ పండ‌గ‌లో విమర్శనాత్మక చర్చను అంగీకరించగలర‌ని ఇదే ఈ పండ‌గ ఆత్మ అని కూడా ఆయ‌న‌ అన్నారు. ఇది(విమ‌ర్శ‌) కళ .. ఇది జీవితానికి అవసరమ‌ని జూరీ హెడ్ లాపిడ్ వ్యాఖ్యానించారు. ఈ చిత్రం గురించి IFFI కలవరపడిందని కూడా ఆయ‌న ఇంత‌కుముందే కామెంట్ చేసారు.

జ్యూరీ అనుభవాన్ని ఆయ‌న షేర్ చేస్తూ పండ‌గ‌లో 14 అంతర్జాతీయ చిత్రాలు అద్భుత సినిమాటిక్ క్వాలిటీని కలిగి ఉన్నాయని అన్నారు. 15వ చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' చూసి మేమంతా కలవరపడ్డాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది ప్రచారం కోసం తీసిన‌ అసభ్యకరమైన చిత్రంగా భావించాం. అటువంటి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో కళాత్మక పోటీ విభాగానికి అనుచితమైనది'' అని లాపిడ్ ఘాటుగా విమ‌ర్శించారు.

ఈ వేదికపై మీతో ఈ భావాలను బహిరంగంగా పంచుకోవడం నాకు పూర్తిగా సుఖంగా ఉంటుంద‌ని అన్నారు. కాబట్టి ఈ ఉత్స‌వాల‌ ఆత్మ తప్పనిసరిగా విమర్శనాత్మక చర్చను అంగీకరించాలని ఘాటైన ప‌ద‌జాలాన్ని ఆయ‌న ఉప‌యోగించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిజానికి 'ది కాశ్మీర్ ఫైల్స్' పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు పూర్తి విరుద్ధంగా ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ చేసిన విశ్లేష‌ణ ఉంది. ఈ సినిమాలో న‌టించిన ప్రధాన పాత్ర‌ధారి అనుపమ్ ఖేర్ 'ది కాశ్మీర్ ఫైల్స్' గురించి మాట్లాడుతూ-''1990లలో కాశ్మీరీ పండిట్ల సమాజానికి జరిగిన విషాదం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలుసుకోవడంలో ఇది సహాయపడింద''ని అన్నారు. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. గొప్ప చిత్ర‌మ‌ని అన్నారు.

సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 మందిని ఇంటర్వ్యూ చేశారు. 19 జనవరి 1990 రాత్రి ఐదు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ లోయలో తమ ఇళ్లను జ్ఞాపకాలను వదిలి వెళ్ళవలసి వచ్చింది. పెరుగుతున్న హింస తర్వాత కాశ్మీరీ హిందువుగా నేను విషాదంతో జీవించాను. కానీ ఎవరూ ఈ విషాదాన్ని గుర్తించలేదు. ప్రపంచం ఈ విషాదాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషాదాన్ని డాక్యుమెంట్ చేయడం ద్వారా చిత్రం వైద్య ప్రక్రియను ప్రారంభించిందని అనుప‌మ్ ఖేర్ వ్యాఖ్యానించారు. కానీ అందుకు విరుద్ధంగా కాశ్మీర్ ఫైల్స్ పై జూరీ అధ్య‌క్షుని కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి. క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ దాదాపు 300 కోట్లు పైగా షేర్ ని వ‌సూలు చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.