Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బయోపిక్ లో తేడా వస్తే తాట తీస్తా: నాదెండ్ల
By: Tupaki Desk | 28 Dec 2018 12:36 PM GMTఎన్టీఆర్ జీవితంపై దర్శకుడు క్రిష్ ‘కథా నాయకుడు’ - 'మహానాయకుడు' పేర్లతో రెండు భాగాల సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై 1984 - ఆగస్టు 15న తిరుగుబాటు చేసిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఈరోజు స్పందించారు. ‘ఎన్టీఆర్' బయోపిక్ లో తన గురించి తప్పుగా - నెగటివ్ గా చూపించే ప్రయత్నం జరగొచ్చని.. అలా చేస్తే తీవ్ర చర్యలు తప్పవని అన్నారు.
తనను నెగటివ్ గా చూపించరాదని ఇప్పటికే చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు జారీచేశామని వెల్లడించారు. ఒకవేళ ఈ సినిమాలో తనను నెగటివ్ గా చూపిస్తే తర్వాత జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీఆర్ జీవితం పేరుతో తనపై దుష్ప్రచారానికి దిగితే మాత్రం చర్యలు తప్పవన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగా ఉండి పనులు చేయించుకోవాలనీ, వైరం పెట్టుకోరాదని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే అంతిమంగా రాష్ట్ర ప్రజలే నష్టపోతారని వ్యాఖ్యానించారు. కాగా నాదెండ్ల పదేపదే దీనిపై మాట్లాడుతుండడంతో... కచ్చితంగా ఇందులో ఆయన్ను నెగటివ్‌గా చూపించినట్లు ఆయనకు సమాచారం ఉండొచ్చని.. అందుకే ఆయన అలా అంటున్నారని భావిస్తున్నారు. అయితే.. నాదెండ్ల అనుమానిస్తున్నట్లుగానే అందులో ఆయన్ను పూర్తిగా నెగటివ్ గా చూపిస్తే ఏం చేస్తారన్నది చూడాలి.