Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ : తప్పు చూపిస్తే భారీ మూల్యం తప్పదు
By: Tupaki Desk | 2 Jan 2019 12:50 PM GMTనందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ మూవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది. భారీ అంచనాల నడుమ - ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ బయోపిక్ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో సినిమాపై వివాదం రాజుకుంది. ఈ చిత్రంలో తనను విలన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ నాదెంట్ల బాస్కరరావు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలో విలన్ ను హీరోలా - హీరోను విలన్ లా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కు అప్పట్లో ఒకసారి పక్షవాతం వచ్చి లేవలేక పోయాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఆయన 12 మంది పిల్లలు కూడా ఆయన్ను పట్టించుకోని సమయంలో లక్ష్మి పార్వతి ఆయనకు సేవ చేసింది. అందుకే ఆమెపై ఆయన అభిమానం పెంచుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆమెను సీఎంగా ఎక్కడ చేస్తాడో అనే భయంతో కుటుంబ సభ్యులు అంతా కూడా ఎన్టీఆర్ ను పదవి నుండి తొలగించేందుకు వెన్ను పోటు పొడిచారు.
కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను పదవి నుండి దించేందుకు ఒక్కటి అయ్యారు. చంద్రబాబు నాయుడు వారికి న్యాయకత్వం వహించాడు. నేను ఎన్టీఆర్ ను పెంచాను, ఆయన స్థాయిని పెంచాను - కాని ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయనకు వెన్ను పోటు పొడిచి ఆయన మరణంకు కారణం అయ్యారు. కాని సినిమాలో మాత్రం నిజంను చూపించకుండా అబద్దాలు చూపిస్తున్నారు. అందుకే నేను కోర్టుకు వెళ్లాను. నా గురించి సినిమాలో తప్పుగా చూపిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాదెండ్ల హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించి చూపించినంత మాత్రాన అంత మంచి వారు అవ్వరు అంటూ నాదెండ్ల అన్నారు. నాదెండ్ల హెచ్చరిక నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచనల్లో పడ్డారనే టాక్ వినిపిస్తుంది.