Begin typing your search above and press return to search.
మహేష్ గొడవను లైట్ తీసుకోమన్నారే!
By: Tupaki Desk | 16 Sep 2018 8:01 AM GMTగత నాలుగైదు రోజుల నుంచి తమిళ స్టాండ్ అప్ షో కమెడియన్ మనోజ్ ప్రభాకర్ మహేష్ బాబు మీద చేసిన నెగటివ్ కామెంట్స్ గురించి ఓ రేంజ్ లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దాని తాలుకు వీడియో యుట్యూబ్ లో డిలీట్ చేసారు కాని వివాదం మాత్రం పూర్తిగా చల్లారలేదు. సదరు హాస్య నటుడు తన ఫేస్ బుక్ లో చేసిన పనిని సమర్ధించుకుంటూనే చివర్లో చిన్న సారీ ఒకటి చెప్పి చల్లార్చే ప్రయత్నం చేసాడు కాని అభిమానులు మాత్రం అది కూడా స్టేజి మీదే చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఇక తమ హీరోను అవమానించినందుకు మనోజ్ ప్రభాకర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ మా సంఘం తరఫున నరేష్ - శివాజీరాజాలు నడిగర్ సంఘంకు లెటర్ పంపిన సంగతి తెలిసిందే. దాని తాలుకు కాపీలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి కూడా. నరేష్ నాజర్ తనకు వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడం గురించి హామీ ఇచ్చినట్టుగా కూడా ట్విట్టర్ లో చెప్పుకున్నారు
కాని వాస్తవం దానికి విరుద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మా నుంచి లెటర్ అందుకున్న అధ్యక్షుడు నాజర్ కార్యదర్శి విశాల్ దీన్ని లైట్ తీసుకున్నట్టు సమాచారం. మహేష్ బాబు గురించి అందరికి తెలుసనీ అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అసలు ముక్కు మొహం తెలియని మనోజ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తే దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. నిజానికి మనోజ్ ప్రభాకర్ మీద చర్యలు తీసుకోవాలన్నా అదంత ఈజీ కాదు. ఇతను రెగ్యులర్ గా సినిమాల్లో కనిపించే ఆర్టిస్ట్ కాదు. చాలా కాలం నుంచి స్టేజి షోలకే పరిమితమయ్యాడు. తమ సభ్యుడు కాని వ్యక్తి మీద నడిగర్ సంఘం చర్యలు తీసుకోలేదు. ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఒరిగేది శూన్యం. సో దీన్ని ఇక్కడితే వదిలేయడమే మంచిదనే నిర్ణయానికి నడిగర్ సంఘం వచ్చినట్టు వినికిడి. మరి మహేష్ సోదరుడు నరేష్ తో పాటు మా సంఘం దీని గురించి మళ్ళి ప్రస్తవిస్తుందా లేక ఇక్కడితో సమాప్తం అంటుందా మరో రెండు రోజుల్లో క్లారిటీ రావచ్చు.