Begin typing your search above and press return to search.
ఎన్నికల్లో మళ్లీ గెలిచిన యంగ్ స్టార్ హీరోలు
By: Tupaki Desk | 21 March 2022 3:30 AM GMTతమిళ నటుల సంఘం అయిన నడిగర్ సంఘం ఎన్నికలు తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో విశాల్ మరియు కార్తీలు మళ్లీ గెలిచారు. నడిగర్ సంఘం నాయకుడిగా నాజర్ విజయం సాధించాడు. సీనియర్ నటుడు అయిన నాజర్ సుదీర్ఘ కాలంగా తమిళ సినీ రంగంలో కొనసాగుతూ వస్తున్నారు. సీనియర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే ఆయన్ను అక్కడి వారు గెలిపించుకున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా యంగ్ హీరో విశాల్ గెలిచాడు. రెండవ సారి విశాల్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టబోతున్నాడు. అలాగే యంగ్ హీరో కార్తీ ట్రెజరర్ పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నడిగర్ సంఘం చివరి సారి జరిగిన ఎన్నికల సందర్బంగా రసాబాసా అయ్యాయి. పోలీసు కేసులు మొదలుకుని పలు విధాలుగా హడావుడి కొనసాగింది. కాని ఈసారి మాత్రం సింపుల్ గానే ఎన్నికలు పూర్తి అయ్యాయి.
ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గం వెంటనే బాధ్యతలు చేపట్టబోతుంది. నడిగర్ సంఘం కోసం విశాల్ చేసిన కృషికి గాను ఆయన్ను నటీ నటులు ఓట్లు వేసి గెలిపించుకున్నారు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఆ మద్య మన తెలుగు సినిమా ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. ఆ ఎన్నికల్లో తెగ హడావుడి జరిగి చివరకు రసా బాసాగా మారి ఎంతగా సంచలనం సృష్టించాయో మన అందరికి తెల్సిందే.
మా ఎన్నికలతో పోల్చితే నడిగర్ సంఘం ఎన్నికల్లోనే హడావుడి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వివాదాలు.. గొడవలు చాలా ఉంటాయి. కాని అక్కడ పెద్ద వారు ఎవరు కూడా వివాదాలు రాజేసే ప్రయత్నం చేయలేదు. స్థానికత అక్కడ పని చేయలేదు. నాన్ లోకల్ అంటూ ఇక్కడ హడావుడి చేసినట్లుగా అక్కడ ఎవరు కూడా వివాదాలకు తావు ఇవ్వలేదు అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ లు జరుగుతున్నాయి.