Begin typing your search above and press return to search.
నడిగర్ విజేత విశాల్.. చిత్తయిన శరత్ కుమార్
By: Tupaki Desk | 19 Oct 2015 4:34 AM GMTతమిళ చిత్ర పరిశ్రమ మార్పుకు పట్టం కట్టింది. పదేళ్లుగా నడిగర్ (దక్షిణ భారత నటీనటుల సంఘం) కు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ సినీ నటులు శరత్ కుమార్ ను కాదని.. విశాల్ అండ్ కోకు ఘన విజయాన్ని అందించింది. అద్యంతం ఉత్కంట భరితంగా సాగి.. పలు ఉద్రిక్తతల మధ్య జరిగిన నడిగర్ ఎన్నికల ఫలితం వచ్చేసింది.
ఎప్పుడేం జరుగుతుందోనన్నట్లుగా హోరాహోరీగా నడిగర్ ఎన్నికలు ఆదివారం చెన్నైలో జరగటం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో విశాల్ పై శరత్ కుమార్ వర్గీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితం గురించి దక్షిణ భారతంలోని చిత్ర పరిశ్రమ వర్గాలు మాత్రమే కాదు.. ఆయా భాషల సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
ఆదివారం ముగిసిన పోలింగ్ అనంతరం.. ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. ఓట్ల లెక్కింపులో శరత్ కుమార్ వర్గం మీద విశాల్ వర్గం భారీ విజయాన్ని సాధించింది. నడిగర్ సంఘం కొత్త అధ్యక్షుడిగా నాజర్ ఎన్నిక కాగా.. శరత్ కుమార్ అదిఫత్యాన్ని ప్రశ్నించిన విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక.. అన్ని పదవులకు విశాల్ వర్గమే విజయం సాధించింది. సాధారణ ఎన్నికల్లో ఎంత ఆవేశం.. మరెంత భావోద్వేగం ఉంటుందో.. అలాంటివి కించిత్ కూడా తగ్గకుండా సాగిన నడిగర్ ఎన్నికల్లో.. ఇప్పటివరకూ అధిపత్యం వహిస్తున్న శరత్ కుమార్ ఘోరంగా ఓటమి పాలయ్యారు