Begin typing your search above and press return to search.
తారల క్రికెట్ మ్యాచ్ కు 9 కోట్లా?
By: Tupaki Desk | 24 March 2016 1:30 PM GMTనడిగర్ సంఘం కోసం సొంతంగా బిల్డింగ్ కట్టిస్తానంటూ ఆ సంఘం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చెన్నైలో విశాల్ అండో కో ఈ ఏప్రిల్ 17న తమిళ సినీ నటీనటులతో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్ కోసం బ్యాంకు నుంచి నడిగర్ సంఘం ఆల్రెడీ రూ.2 కోట్ల దాకా రుణం తీసుకుంది. ఆ రుణం తీర్చడానికే ఈ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయించాడు నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్. తమిళ సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్నారు.
కోలీవుడ్ చరిత్రలో ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్.. మల్లూ వుడ్, శాండిల్ వుడ్ ల నుంచి కూడా కొందరు హీరోల్ని ఈ మ్యాచ్ కోసం ఆహ్వానించింది నడిగర్ సంఘం. చిరు.. అమితాబ్.. మ్యాచ్ కు రావడానికి అంగీకారం కూడా తెలిపారట. ఇక తమిళ పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ - యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ సహా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా మ్యాచ్ కు హాజరవబోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై విపరీతమైన ఆసక్తి నెలకొంటోంది.
ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని ఓ తమిళ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఏకంగా రూ.9 కోట్లకు కొన్నట్లు సమాచారం. ఇక టికెట్ల ద్వారా వచ్చే మొత్తంతో స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగానే ఉండబోతోంది. మొత్తానికి రూ.2 కోట్ల అప్పు తీర్చడానికి మ్యాచ్ పెడితే.. దానికి ఎన్నో రెట్లు ఆదాయం వచ్చి పడుతోంది. భవిష్యత్తుల నడిగర్ సంఘానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా చేయడానికి ఇబ్బంది లేకుండా భారీగా నిధులు సమకూరబోతున్నాయన్నమాట.