Begin typing your search above and press return to search.

నడిగర్ సంఘం ఎన్నికలు.. అదిరిపోయే డ్రామా

By:  Tupaki Desk   |   18 Oct 2015 9:50 AM GMT
నడిగర్ సంఘం ఎన్నికలు.. అదిరిపోయే డ్రామా
X
మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల డ్రామాను అంత సులువుగా మరిచిపోలేం. ‘మా’ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రాజకీయాలు నడిచాయి ఈసారి. ఆరోపణలు ప్రత్యారోపణలతో.. ఎత్తులు పైఎత్తులతో ‘మా’ రాజకీయం రసవత్తరంగా సాగిపోయింది. ఎన్నికల రోజు కూడా డ్రామా భలే సాగింది. ఐతే తమిళ నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారాలు.. ఈ రోజు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న డ్రామా చూస్తే మాత్రం మన ‘మా’ ఎన్నికల సమయంలో జరిగిందంతా జుజుబి అనిపించకమానదు. సాధారణ ఎన్నికల కంటే కూడా ‘నడిగర్ సంఘం’ ఎన్నికలే ఎక్కు కాక రేపుతున్నాయి తమిళనాడు. రాష్ట్ర ప్రజానీకమంతా టీవీల ముందు, ఇంటర్నెట్ ముందు కూర్చుని ఈ డ్రామాను వీక్షిస్తోంది.

సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం నుంచి ఇండియా లెవెల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది ‘నడిగర్ సంఘం ఎలెక్షన్స్’ హ్యాష్ ట్యాగ్. తమిళ మీడియా అంతా ఈ ఎన్నికల కవరేజీకే అంకితమైపోయింది. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో మోతెక్కించేస్తున్నారు. కమల్ వచ్చాడు.. రజినీ వచ్చాడు.. అడిగో శింబు.. ఇదిగో విజయ్.. అంటూ అప్ డేట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం శరత్ కుమార్, నాజర్ మధ్య పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 నుంచే ఓటింగ్ మొదలవడం విశేషం. మనదగ్గర మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్నదే 700 మంది కాగా.. నడిగర్ సంఘం ఎన్నికల్లో మధ్యాహ్నానికే 1400 ఓట్లు పడటం విశేషం. అక్కడ మొత్తం 3 వేల ఓట్లుండటం గమనార్హం. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై పెద్ద స్థాయిలో బెట్టింగులు కూడా నడుస్తున్నాయి తమిళనాట. కొసమెరుపు ఏంటంటే.. ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి వచ్చిన విశాల్ మీద శరత్ వర్గం వారు దాడి చేశారట. అతడికి గాయాలయ్యాయట. అతను హాస్పిటల్ కు వెళ్తున్న దృశ్యాల్ని అక్కడి మీడియా హైలైట్ చేస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత తనపై జరిగిన దాడికి సంబంధించి వివరాలు వెల్లడిస్తానని విశాల్ అంటున్నాడు. మరోవైపు ఎన్నికల్లో గెలుపు కోసం శరత్ వర్గం అక్రమాలకు పాల్పడుతోందంటూ నాజర్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి డ్రామా అయితే రసపట్టులో సాగుతోంది. చివరికి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.