Begin typing your search above and press return to search.
పోలీసుల ప్రశ్నలతో ఆసుపత్రి పాలైన నటుడు
By: Tupaki Desk | 16 Sep 2017 5:22 AM GMTబుల్లెట్ల మాదిరి పోలీసులు ప్రశ్నలు సంధిస్తుంటే ఆ నటుడి నోటి నుంచి మాట రాని పరిస్థితి. చివరకు తీవ్ర ఆందోళనకు గురై.. ఆసుపత్రి పాలైన ఉదంతం ఒకటి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ మలయాళ నటిని లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు దిలీప్ ఇప్పటికే జైలుపాలు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకున్నా కోర్టు నుంచి సానుకూల ఆదేశం రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా సదరు నటుడికి సన్నిహితుడైన దర్శకుడు కమ్ నటుడు.. కమెడియన్.. సింగర్ లాంటి ఎన్నో టాలెంట్లు ఉన్న నదీర్ షా పోలీసులు ప్రశ్నలు సంధిస్తుంటే మాత్రం నోట మాట రాకుండా ఉండిపోయారు. అంతేకాదు.. తీవ్ర ఒత్తిడికి గురై బీపీతో అనారోగ్యం పాలయ్యారు.
నటిపై జరిగిన లైంగిక వేధింపుల ఉదంతం గురించి నదీర్ షాను గతంలో కూడా ఒకసారి ప్రశ్నించారు. ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా కోలుకున్న ఆయన్ను మరోసారి విచారించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా నటి లైంగిక వేధింపుల అంశంపై ఆయన్ను ప్రశ్నలు సంధించారు.
వాటికి సమాధానం చెప్పలేక బిత్తరపోయిన నదీర్ షాకు ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. దీంతో.. ఆందోళనకు గురైన పోలీసులు వెంటనే తమ విచారణను నిలిపివేశారు. గత నెలలోనూ నదీర్ షాను విచారించే సమయంలో పోలీసులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా అలాంటిదే రిపీట్ కావటంతో.. ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మాత్రమే విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.