Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. సాహో మహానటి కాంబో

By:  Tupaki Desk   |   18 Feb 2020 7:30 AM GMT
ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. సాహో మహానటి కాంబో
X
ఇండస్ట్రీలో కొన్ని కలయికల గురించి వార్తలు వచ్చినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అస్సలు చాన్సే లేదు అంటూ అంతా అనుకుంటారు. ఆ కాంబినేషన్‌ లో సినిమా వచ్చేది లేనిది తర్వాత విషయం కాని మొత్తానికి ఆ వార్తలు అందరిలో చర్చనీయాంశం అవుతాయి. ప్రస్తుతం అదే తరహా వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం నివ్వెర పోయి అంత సీన్‌ లేదులే అంటున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటీ అంటే బాహుబలి.. సాహో చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌ హీరో అయిన ప్రభాస్‌ తో ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట. మహానటి చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ఈ దర్శకుడు తదుపరి చిత్రంగా ప్రభాస్‌ తో చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ మామ అయిన అశ్వినీదత్‌ కూడా వీరిద్దరికి కలిపేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రభాస్‌ ఇమేజ్‌ కు నాగ్‌ అశ్విన్‌ గత చిత్రాలను చూస్తే వీరిద్దరి జోడీ అస్సలు సెట్‌ అవ్వదని అంతా అనుకుంటున్నారు. ఎవడే సుబ్రమణ్యం మరియు మహానటి వంటి విభిన్నమైన చిత్రాలు చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌ మాస్‌ హీరో కమర్షియల్‌ హీరో అయిన ప్రభాస్‌ తో ఆ స్థాయి సినిమాను తీయగలడా అంటూ అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే ఒక స్టోరీని సిద్దం చేసి ప్రభాస్‌ కాంపౌండ్‌ కు పంపించాడని వారు ఇంట్రెస్ట్‌ గా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విభిన్నంగా ఉండేలా సినిమా చేయాలనుకుంటే ప్రభాస్‌ ఈ సినిమాకు ఒప్పుకునే ఛాన్స్‌ ఉందని కొందరు అంటున్నారు. మరి ఏం జరుగబోతుందో చూడాలి.