Begin typing your search above and press return to search.

‘యన్.టి.ఆర్’ సినిమా వద్దు అనేశాడే..

By:  Tupaki Desk   |   9 May 2018 1:30 AM GMT
‘యన్.టి.ఆర్’ సినిమా వద్దు అనేశాడే..
X
టాలీవుడ్ కు ఒక్కసారిగా బయోపిక్ ఫీవర్ పట్టుకుంది. ఈ బుధవారం రిలీజవుతున్న ‘మహానటి’ సినిమా సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ జీవిత కథతో బాలయ్య కథానాయకుడిగా ఓ సినిమా పట్టాలెక్కబోతుండగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో ‘యాత్ర’ అనే సినిమా రాబోతోంది. ఐతే సినీ నటుల జీవితాల్ని సినిమాగా తీయడం సరైన ఆలోచనేమీ కాదంటున్నాడు నాగ్ అశ్విన్. తను స్వయంగా సావిత్రి కథను సినిమాగా తీసి కూడా అతను ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగని సినీ నటుల జీవితాల్ని జనాలకు చూపించకూడదనేమీ అతను అనట్లేదు. ఇందుకు సినిమా కంటే వెబ్ సిరీస్ సరైన మార్గం అని అతను చెబుతున్నాడు. అమేజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మూవీ ఫ్లాట్ ఫాంల కోసం ప్రత్యేకంగా సిరీస్ లాగా ఈ సినిమాలు తీయాలని అతను అభిప్రాయపడ్డాడు.

ఓక లెజెండరీ ఆర్టిస్ట్ గురించి ఒక సినిమాలో చెప్పడం కష్టమని.. లెంగ్త్ చాలా ఎక్కువ అవుతుందని.. అలాగని రెండు భాగాలుగా తీస్తే బాగోదని.. పరిమిత నిడివిలో సినిమా చేయడం కోసం చాలా అంశాలు పరిహరించాల్సి వస్తుందని అతనన్నాడు. అందుకే సినిమాలా కాకుండా నెట్ ఫ్లిక్స్.. అమేజాన్ లాంటి వాటిలో వచ్చేలా సిరీస్ లాగా చేయాలని అతనన్నాడు. సావిత్రి గారి జీవితంలో నిజాయితీగా చెప్పడానికి చాలా కంటెంట్ ఉందని.. అలాగే ఎన్టీఆర్.. ఏఎన్నార్.. ఎస్వీఆర్ లాంటి దిగ్గజాల గురించి చెప్పడానికి చాలా ఉంటుందని.. వాళ్ల జీవితాల్ని సినిమాల్లా కాకుండా.. వెబ్ సిరీస్ గా చేస్తే బాగుంటుందని అతనన్నాడు. సినిమా పెద్దగా తీసి రెండు భాగాలుగా రిలీజ్ చేయడమనే ఆలోచనకు తాను వ్యతిరేకమని అతను స్పష్టం చేశాడు.