Begin typing your search above and press return to search.

ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ గజిబిజి

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:45 PM GMT
ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ గజిబిజి
X
ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మూవీ చివరి షెడ్యూల్‌ ప్రారంభం అయ్యింది. ఆలస్యం అయినా కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు రాధేశ్యామ్‌ ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అంటూ యూవీ క్రియేషన్స్‌ వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆ తర్వాత చేయబోతున్న ఆదిపురుష్‌ సినిమా 2022 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా స్పష్టతను ఇచ్చారు. ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ చేయబోతున్న మూవీ ఎప్పుడు అనేది అభిమానుల్లో గందరగోళంను క్రియేట్‌ చేస్తోంది.

రాధేశ్యామ్‌ తర్వాత వెంటనే నాగ్‌ అశ్విన్‌ మూవీ అనుకున్నారు. కాని ప్రభాస్‌ రిక్వెస్ట్‌ తో నాగ్‌ అశ్విన్‌ ఒప్పుకుని ఆది పురుష్‌ తర్వాత చేసేందుకు ఓకే చెప్పాడు. ఆది పురుష్‌ తర్వాత మొదలు పెట్టినా కూడా 2022లోనే తన సినిమాను విడుదల చేయాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆదిపురుష్‌ ఆగస్టులో విడుదల అయితే 2022లో నాగ్‌ అశ్విన్‌ విడుదల సాధ్యమా అంటున్నారు. ఆది పురుష్‌ కంటే ముందే నాగ్‌ అశ్విన్‌ సినిమా వచ్చే అవకాశం ఉందా అనే విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.

మొత్తానికి నాగ్‌ అశ్విన్‌ మూవీ 2023 లో అంటూ కొందరు లేదు 2022లోనే అంటూ మరి కొందరు ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు. మరి నాగ్‌ అశ్విన్‌ మాట ఏంటో చూడాలి. వచ్చే ఏడాది సమ్మర్‌ నుండి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ మూవీ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఏడాదిలో పూర్తి చేసి 2022 సమ్మర్‌ లో విడుదల చేస్తే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. కాని భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడం వల్ల ఏడాదిలో అయ్యే అవకాశాలు లేవు అనిపిస్తుంది.