Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ `పాన్ వ‌ర‌ల్డ్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ` రిలీజ్ ఎపుడు?

By:  Tupaki Desk   |   3 Jan 2021 6:30 AM GMT
ప్ర‌భాస్ `పాన్ వ‌ర‌ల్డ్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ` రిలీజ్ ఎపుడు?
X
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేశారు. ఆదిపురుష్ 3డి.. స‌లార్ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ప్ర‌క‌టించారు. ఇది పాన్ వ‌ర‌ల్డ్ (ఇండియా) మూవీగా ప‌లు భాష‌ల్లో అత్యంత భారీగా రిలీజ‌వుతుంద‌ని కంటెంట్ ప‌రంగా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో అల‌రిస్తుంద‌ని అశ్వ‌నిద‌త్ - నాగ్ అశ్విన్ బృందం ప్ర‌క‌టించ‌డంతో స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఇంత‌కీ పాన్ వ‌ర‌ల్డ్ సైన్ ఫిక్ష‌న్ మూవీ రిలీజ్ అయ్యేది ఎపుడు? అన్న‌దానికి తాజాగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ మూవీని ఈ కొత్త సంవ‌త్స‌రంలోనే ప్రారంభించి వ‌చ్చే ఏడాది (2022లో) రిలీజ్ చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిష్ఠాత్మ‌క వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

ప్ర‌స్తుత గ్యాప్ లో నాగ్ అశ్విన్ `జాతి చిత్రాలు` అనే సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ సినిమాకి బ‌డ్జెట్ ప‌రంగా రాజీకి వ‌చ్చే ప్ర‌సక్తే లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అలాగే కంటెంట్ డ్రివెన్ సినిమాల‌ను చిన్న బ‌డ్జెట్ పెద్ద బ‌డ్జెట్ అంటూ విడ‌దీసి చూడ‌లేమ‌ని కూడా ఆయ‌న తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. ఎందుకంటే కథను కలిగి ఉండి వ్యాల్యూ ఉన్నంత వరకు.. సినిమా నిర్మాణ వ్యయం పట్టింపు లేదు. `జాతి చిత్రాలు` సినిమాను 5-10 సంవత్సరాల తరువాత కూడా జంధ్యాల‌- ఎస్.వి.కృష్ణారెడ్డి - ఈవీవీ సత్యనారాయణ సినిమాల త‌ర‌హాలో ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకునే విధంగా ఉంటుంది. యూట్యూబ్ లో తిరిగి చూడ‌గ‌లిగేంత విష‌యం ఉంటుంది.. అని నాగ్ అశ్విన్ తెలిపారు. రిలీజ్ తేదీలు బ‌డ్జెట్ టెన్ష‌న్ లేకుండా సినిమాలు చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు.