Begin typing your search above and press return to search.

కేటీఆర్ కి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడి ఛాలెంజ్‌!

By:  Tupaki Desk   |   19 July 2019 4:13 AM GMT
కేటీఆర్ కి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడి ఛాలెంజ్‌!
X
దేశంలోని మెట్రో న‌గ‌రాల‌న్నీ నీటి క‌ట‌క‌ట‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. ఎక్క‌డ చూసినా నీటి స‌మ‌స్యే. దీనికి ప్ర‌ధాన కార‌ణం మెట్రో న‌గ‌రాల్లో విస్త‌రిస్తున్న అపార్ట్ మెంట్ క‌ల్చ‌ర్‌. ఇదే ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారుతోంది. న‌గ‌రాల్లో వున్న చెరువులు అంత‌రించిపోవ‌డం - ఆ స్థానాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు - అపార్ట్‌ మెంట్ లు వెల‌వ‌డంతో భూగ‌ర్ఘ జ‌లాలు అంత‌రించిపోతున్నాయి. గ‌త కొంత కాలంగా చెన్నై న‌గ‌రం దాహం తీర్చుకోవ‌డానికి చుక్క‌నీరు దొర‌క్క అల్లాడుతున్న విజువ‌ల్స్ చూసి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో సంచ‌ల‌న ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. దీన్ని బ‌ట్టే రాగ‌ల రోజుల్లో నీటి స‌మ‌స్య మెట్రో న‌గ‌రాల్ని జ‌న‌జీవ‌నాన్ని ఏ స్థాయిలో స్థంభింప‌జేయ‌నుందో అర్థ‌మ‌వుతోంది.

చెన్నై - బెంగ‌ళూరు - ఢిల్లీ - కోల్‌క‌తా - ముంబాయి వంటి మెట్రో న‌గ‌రాల‌తో పాటు నీట స‌మ‌స్య హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని కూడా అత‌లాకుత‌లం చేయ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రానికి మ‌రో 43 రోజులు మాత్ర‌మే వాట‌ర్ వ‌స్తుంద‌ని.. ఆ త‌రువాత నుంచి నీటి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని సోష‌ల్ మీడియాతో పాటు ప్ర‌ముఖ ఇంగ్లీష్ డైలీల్లో ప‌తాక శిర్షిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేద‌ని తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నా వాస్త‌వం మాత్రం మ‌రోలా వుండ‌బోతోంద‌ని `మ‌హాన‌టి` ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్ర‌చారం చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రో 43 రోజుల్లో మ‌న‌కు నీటి క‌ష్టాలు రాబోతున్నాయి. దాన్ని త‌ట్టుకోవాలంటే ప్ర‌తి ఒక్క‌రు త‌మ దిన చ‌ర్య‌ను ఒకే ఒక బ‌క్కెట్‌ తో ముగించి నీటిని ఆదా చేయాల‌ని బ‌క్కెట్ ఛాలెంజ్ పేరుతో సోష‌ల్ మీడియా వేదిక‌గా నాగ్ అశ్విన్ ప్ర‌చారం చేస్తున్నారు. అంత‌టా బోర్ లు ఎక్కువైపోయాయి. దాంతో భూగ‌ర్భ జ‌లాలు కూడా అడుగంటి పోయాయి. 1500 ఫీట్లు వెళ్లితేనే వాట‌ర్ ప‌డే ప‌రిస్థితి. ఈ స‌రిస్థితి మారాలంటే ప్ర‌భుత్వం కొత్త వాట‌ర్ పాల‌సీని తీసుకురావాలి. నిబంధ‌న‌ల్ని క‌ఠిన‌త‌రం చేయాలి. అప్పుడే భూగ‌ర్భ జ‌లాలు అడుగంట కుండా వుంటాయి. దీనికి అంతా స‌హ‌క‌రించాలి`` అంటూ కొత్త ఉద్య‌మానికి తెరలేప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.