Begin typing your search above and press return to search.
ఈ ఫీలింగ్ కోసమే ఏడాదిగా వెయిట్ చేస్తున్నాంః నాగ్ అశ్విన్
By: Tupaki Desk | 8 March 2021 3:33 AM GMTమహానటి సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న నాగ్ అశ్విన్ తదుపరి సినిమాను ప్రభాస్ తో చేసేందుకు ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన అభిరుచి కొద్ది కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమా జాతి రత్నాలను నిర్మాతగా మారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు గత ఏడాదిలోనే విడుదలకు సిద్దం అయినా కూడా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. పలు సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అయినా.. ఈ సినిమాకు కూడా ఓటీటీ నుండి భారీ ఆఫర్లు వచ్చినా కూడా థియేటర్ రిలీజ్ కు ఆపారు.
ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాతి రత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. హలో వరంగల్ థ్యాంక్యూ అందరు మాస్క్ లు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. సినిమా ను సంవత్సర కాలంగా విడుదల చేయకుండా ఉంచుకున్నాం. ఇలాంటి సందర్బం కోసం ఇలాంటి ఫీలింగ్ కోసమే. మీ అందరి ముందుకు ఇలా రావడం కోసం రెండేళ్లుగా సినిమాను మా దగ్గర ఉంచుకున్నాం. నవీన్ ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్లుగా మారి పోతూ ఉంటాడు. ఏజెంట్ పాత్ర చేసినా జోగిపేట కుర్రాడిగా చేసినా నవీన్ ఆ పాత్రకు తగ్గట్లుగా కనిపిస్తాడు. ఈ వెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. ఇంత పెద్ద ఈవెంట్ ను జాగ్రత్తగా నిర్వహించినందుకు పోలీసు వారికి కృతజ్ఞతలు.