Begin typing your search above and press return to search.
రివ్యూలు - బాయ్ కాట్ ట్రెండ్ పై నాగ్ కామెంట్స్..!
By: Tupaki Desk | 14 Sep 2022 10:30 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం యువ హీరోలతో పోటీగా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు' చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ్.. లేటెస్టుగా 'బ్రహ్మాస్త్రం' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. దసరా సందర్భంగా 'ది ఘోస్ట్' సినిమాతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్న బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ పై నాగార్జున స్పందిస్తూ.. ఇది ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తోందని తాను అనుకోవడం లేదని అన్నారు. బాగున్న సినిమాలను ఏ నెగిటివ్ ప్రచారం కూడా ఆపలేదని అభిప్రాయ పడ్డారు.
"బాలీవుడ్ లో 'లాల్ సింగ్ చడ్డా' ఆడలేదు.. కానీ 'బ్రహ్మాస్త్రం' ఆడింది. 'లాల్ సింగ్ చద్దా' హిట్ అవ్వలేదంటే అది బాయ్ కాట్ ట్రెండ్ వల్ల మాత్రం కాదు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన 'గంగూబాయి కతియావాడి' 'భూల్ భులయ్యా 2' 'జుగ్ జుగ్ జీయో' చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. 'కార్తికేయ 2' 'RRR' 'కేజీఎఫ్ 2' 'పుష్ప' వంటి మన సౌత్ చిత్రాలు హిందీలో బాగా ఆడాయి. సినిమా బాగుంటే ఆడుతుంది" అని నాగార్జున అన్నారు.
సినిమా రివ్యూలపై మాట్లాడుతూ.. "అప్పట్లో రివ్యూలు పేపర్లలో వారం రోజుల తర్వాత వచ్చేవి. అప్పటికి సినిమా ఉందో లేదో కూడా తెలిసేది కాదు. రివ్యూలను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా టాక్ లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నేను కూడా ఏవైనా సినిమాలు - వెబ్ సిరీస్ లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తాను. కనీసం వెయ్యి రివ్యూలు - 7 రేటింగ్ ఉంటేనే సినిమా లేదా సిరీస్ చూస్తాను. లేదంటే సమయం వృధా అవుతుంది" అని నాగ్ రివ్యూల ప్రాధన్యత గురించి చెప్పారు.
"సినిమా చచ్చిపోతోందని చాలామంది అంటుంటారు. కానీ సినిమా పెరుగుతోందనేది నా అభిప్రాయం. క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ - పోటీ కూడా బాగా పెరిగిపోతోంది. ట్రెండ్ కి తగ్గట్టు యాక్టర్స్ - డైరెక్టర్స్ అప్‌డేట్ అవుతుండాలి. దర్శక నిర్మాతల మధ్య కథ గురించి లోతైన చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు డిఫరెంట్ కథలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రీగా చూపిస్తామన్నా సినిమాలను చూసేందుకు కొంతమంది ప్రేక్షకులు ఇష్టపడరేమో" అని నాగార్జున అన్నారు.
"నేను నంబర్స్ కోసమని.. మిగతా విషయాల కోసమనీ కథల్ని ఎంపిక చేసుకోవడం ఎప్పుడో మానేశాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. నచ్చని కథల్ని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నా. 38 ఏళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానంటే నటుడిగా నేను చాలా సాధించినట్టే. ఇప్పటికీ నా సినిమాలు చూసి మెచ్చుకుంటున్నారు. నాకు అది చాలు".
"జీవితంలోని ఈ దశని చాలా ఆస్వాదిస్తున్నాను. అన్నిటికంటే కూడా మెంటల్ గా నా పైన ఉన్న బరువు తగ్గించుకున్నట్టుగా భావిస్తున్నా. పెట్టుబడి పెట్టిన నిర్మాత డబ్బు చేసుకోవడం ముఖ్యమనే విషయాన్ని మా నాన్న నాకు నేర్పించారు. యాక్టర్ గా నా శక్తి ఎంత.. నా సినిమాలు ఎంత వసూలు చేస్తాయనేది నాకు తెలుసు. సెట్ కి వెళితే అందరం సంతోషంగా పనిచేసుకోవాలి. అంతేకానీ అనవసరమైన లెక్కల కోసమని.. లేని ఒత్తిడి సినిమా బృందంపై ఉండకూడదు" అని నాగార్జున చెప్పుకొచ్చారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై నాగ్ మాట్లాడుతూ.. 'ది ఘోస్ట్' సినిమా అక్టోబరు 5న విడుదలవుతుంది. చాలా నమ్మకంగా ఉన్నా. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు గొప్ప చేంజ్ అని చెప్పను కానీ.. సాంకేతికంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 'గరుడ వేగ' చూసి.. ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయాలనుకున్నా. అది 'ఘోస్ట్' తో కుదిరింది. సినిమా చేస్తున్నప్పుడు ప్రవీణ్ ని ఇంతకాలం నేనెందుకు గుర్తించలేదా అని బాధపడ్డా. ఈ సినిమా కోసం నేను వెపన్ ట్రైనింగ్ - మార్షల్ ఆర్ట్స్ లో కొంత శిక్షణ తీసుకున్నాను. ఇందులో యాక్షన్ మాత్రమే కాదు.. బ్రదర్-సిస్టర్ అండ్ సిస్టర్-డాటర్ సెంటిమెంట్ కూడా ఉంది అని తెలిపారు.
నాగార్జున తన 100వ సినిమాపై స్పందిస్తూ.. దీని కోసం పలువురు దర్శకుల నుండి కథలు వింటున్నానని చెప్పారు. ఆ సినిమా గొప్పగా ఉండాలని.. ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటున్నామని టాలీవుడ్ కింగ్ తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.